Comedians Hit Kannada Batch plop BB8 లో కమెడియన్స్ దెబ్బ కన్నడ బ్యాచ్ అబ్బా


Thu 28th Nov 2024 06:57 PM

avinash  BB8 లో కమెడియన్స్ దెబ్బ కన్నడ బ్యాచ్ అబ్బా


Comedians Hit Kannada Batch plop BB8 లో కమెడియన్స్ దెబ్బ కన్నడ బ్యాచ్ అబ్బా

ఇప్పటివరకు బిగ్ బాస్ 8 లో కన్నడ బ్యాచ్ చాలా స్ట్రాంగ్ గా కనిపించేవారు. వారిలో వారు నామినేషన్స్ వేసుకోరు, ఒకరికొకరు సపోర్ట్ గా నిలవడం ఇవన్నీ మిగతా కంటెస్టెంట్స్ కన్నా వీరే స్ట్రాంగ్ గా ఉండేవారు. కానీ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కన్నడ బ్యాచ్ కంచు కోటను బద్దలు కొట్టి అందులోనుంచి యష్మి గౌడ ను ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లేలా చేసారు. 

ఇక ఈ వారమైతే కామెడియన్స్ ఇచ్చిన స్ట్రోక్ కి కన్నడ బ్యాచ్ విల విల కొట్టుకున్నారు. కమెడియన్స్ కేవలం కామెడీనే చేస్తారు వారు టాస్క్ లు ఆడరు అన్నోళ్లకు సమాధానం చెప్పారు అవినాష్, రోహిణి. ఇప్పటికే కన్నడ నటుడు పృథ్వీ ని మెగా చీఫ్ టాస్క్ లో ఓడించిన రోహిణి తనతో పాటుగా ఆడిన తేజ, విష్ణు ప్రియా, గౌతలను ఓడించి టికెట్ టు ఫినాలే మొదటి కంటెండర్ గా నిలిచింది. 

అదే పెద్ద షాక్ అనుకుంటే గత రాత్రి అవినాష్ ప్రేరణ, నబీల్, పృథ్వీలతో పోటీ పడి రెండో కంటెండర్ అయ్యాడు. అవినాష్ గెలవడంతో పృథ్వీ షాకయ్యాడు. నిఖిల్ పృథ్వీ చాలా స్ట్రాంగ్ వీరు ప్రతి టాస్క్ గెలుస్తారు, కండ బలం ఉంది, కానీ పృథ్వీ కి బుద్ది బలం లేకపోవడం మైనస్ అయ్యింది. దానితో కమెడియన్స్ గా తీసిపారేసిన రోహిణి, అవినాష్ లు కన్నడ బ్యాచ్ కి అంతగా షాకిచ్చారు. 


Comedians Hit Kannada Batch plop :

Bigg Boss 8-Avinash and Rohini task win 





Source link