Telangana Jana Garjana Sabha :త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లాయి. ఎవరికి వారిగా గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్…. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్ తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా… పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. పొంగులేటి చేరికతో పాటు భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా… ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సభకు తెలంగాణ జన గర్జన అనే పేరు పెట్టగా…. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.