Couple Photo Shoot Goes Wrong Colour Bomb Malfunctions And Burns Bride | Viral Video: ప్రివెడ్డింగ్ సాంగ్ షూటింగ్ లో పేలిన కలర్ బాంబు – యువతికి గాయాలు

Colour Bomb Malfunctions: కెనడాలో నివాసం ఉండే ఓ భారతీయ జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సంప్రదాయబద్దంగా ఇండియాలోతమ పెళ్లిచేసుకోవాలని వచ్చారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఫోటో షూట్  చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో  ఓ కలర్ బాంబు పేల్చి ఆ కలర్స్ గాల్లో ఎగురుతూండగా.. పెళ్లి కూతుర్ని గాల్లోకి ఎగరేసి..ఫోటో, వీడియో తీయించుకోవాలనుకున్నారు. అంతే చేశారు కానీ.. అక్కడే తేడా కొట్టింది. కలర్ బాంబు పేలి.. యువతికి అంటుకుంది. చావు తప్పింది కానీ గాయాలయ్యాయి.                   

విక్కీ , పియా అనే ఆ జంట తమ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకున్నారు.   వరుడు ఫోటో కోసం వధువును పైకి లేపిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఒక మంచి  షాట్ కోసం కలర్-బాంబులు పేలాలని ప్లాన్ చేశారు.  కానీ అది పనిచేయక మాపైకి వచ్చేసిందన్నారు. వారు షేర్ చేసిన వీడియోలో వధువుకు అయిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఆమె వీపుపై కాలిన గాయం , ప్రమాదం కారణంగా ఆమె జుట్టు కాలిపోయిన గుర్తులుఉన్నాయి.  ప్రమాదం  జరిగిన వెంటనే  సమీప ఆసుపత్రికి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సంతోషం వ్యక్తంచేశారు.         

ఈవెంట్లలో కలర్ బాంబ్ బాణసంచా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పడానికే ఈ విషయం బయట పెడుతున్నామని ఆ జంట చెబుతోంది.  మేము అన్ని భద్రతా జాగ్రత్తలు పాటించామని… అయినప్పటికీ ఏదో తప్పు జరిగిందన్నారు. వీరి వీడియో విస్తృతంగా వైరల్ అయింది.  వీడియోను 22 మిలియన్ల మంది చూశారు.  


పలువురు నెటిజన్లు కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రీ వెడ్డింగ్ సూట్లలో జరుగుతున్న ప్రమాదాలను పలువురు గుర్తు చేసుకున్నారు.  మారుతున్న యువత అభిరుచికి అనుగుణంగా యువత  తమ పెళ్లిని మొమరుబుల్ గా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. అందు కోసం ఎంత ఖర్చు అయినా సరే భరించాలని అనుకుంటున్నారు. భారతీయ సంప్రదాయాలపై ఎన్నైరైలు ఇంకా ఎక్కువ మక్కు చూపుతున్నారు.  ఈ  క్రమంలో విదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ పెళ్లిళ్లను ఇండియాలో చేసుకునేందుకు వస్తున్నారు.                                

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link