ByGanesh
Wed 18th Dec 2024 12:09 PM
పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబో లో తెరకెక్కుతున్న క్రేజి మూవీ OG చిత్రంపై ట్రేడ్ లోనే కాదు పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న OG చిత్రంలో ఇప్పటివరకు పలు భాషల నటులు భాగమయ్యారు. ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటి శ్రీయ రెడ్డి మరో క్రేజీ కేరెక్టర్ లో నటిస్తుంది.
ఇప్పుడు OG లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ అనే వార్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. గ్లామర్ డాల్ నేహా శెట్టి OG లో భాగం కాబోతుందట. పవన్ కళ్యాణ్ OG లో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నేహా శెట్టిపై దర్శకుడు సుజిత్ సాంగ్ షూట్ చేపెట్టారట.
ప్రస్తుతం థాయ్లాండ్ లో పాట చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో పవన్ కూడా స్టెప్స్ వేస్తారా లేదంటే కేవలం నేహా మాత్రమే ఈ పాటలో ఆడి పాడుతుందా అనేది తెలియాల్సి ఉంది.
Crazy heroine entry into OG movie:
Neha Shetty Item Song in Pawan Kalyan OG