ByGanesh
Thu 03rd Aug 2023 08:13 PM
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సలార్ రెండు భాగాలుగా రాబోతున్నట్టుగా మేకర్స్ టీజర్ వదిలి మరీ ప్రకటించారు. సలార్ టీజర్ ఇప్పటికి రికార్డులని కొల్లగొడుతూనే ఉంది. సలార్ టీజర్ లో ఇచ్చిన హైప్ తగ్గకుండా ట్రైలర్ కట్ చేయబోతున్నారట మేకర్స్. సలార్ ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా సలార్ ట్రైలర్ ఉండబోతోంది అని సమాచారం . ప్రభాస్ కటౌట్ కి తగినట్లుగా టీజర్ ని ఫాన్స్ మెచ్చేలా చూపించారు. ఇప్పుడు ట్రైలర్ వంతు.
సలార్ షూటింగ్ చాలా ముందుగానే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా ముగింపు దశకు తీసుకొచ్చేసింది టీం. సలార్ విడుదలయ్యే ప్రతి లాంగ్వేజ్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు మాత్రమే మిగిలున్నాయట. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సలార్ టీజర్ కి వచ్చిన ఎక్సట్రార్డినరీ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకుని సలార్ సినిమాకి ఆడియన్స్ ని ప్రోపర్ గా ప్రిపేర్ చెయ్యడానికి సరిపోయేదిలా ఈ ట్రైలర్ కట్ ఉండాలని ప్రశాంత్ నీల్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే రెండు మూడు ట్రైలర్ కట్స్ చేసినా అది ప్రశాంత్ నీల్ కి నచ్చక ఇంకా ఇంకా చూస్తున్నారట.
ఇక సలార్ ట్రైలర్ మాత్రం కొద్దిగా లెంతిగా ఉండబోతుంది అని తెలుస్తోంది. అది ఎన్ని నిమిషాలనేది బయటపెట్టకపోయినా.. ఫాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ ఖాయమంటుంటూ వార్తలొస్తున్నాయి. ఈ నెలలోనే సలార్ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. ఈ చిత్రంలో విలన్ గా పృథి రాజ్ సుకుమారన్ నటిస్తుండగా.. జగపతి బాబు, ఇంకా చాలామంది విలన్ రోల్స్ లో కనిపించబోతున్నారు. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
Crazy news on Salaar trailer:
Salaar trailer nws update