Cyber frauds gift free mobile to cheat software engineer of Rs 2.8 cr in Bengaluru

Bengaluru Cyber Crime | బెంగళూరు: డబ్బులు ఊరకే రావు అంటే కొందరు వినిపించుకోరు. ఇదే సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. లాటరీలో కోట్లు గెలిచారనో, మొబైల్ గెలిచారని, క్యాష్ బ్యాక్ వచ్చిందని లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద మొబైల్ గిఫ్ట్ అని టెకీకి పంపించారు. అందులో సిమ్ కార్డ్ వేసి వివరాలు ఎంటర్ చేయగా.. బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.2.8 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. తాను మోసపోయానని తెలుసుకునేందుకు సైతం ఆ టెకీకి నెల రోజులు పైగా పట్టింది. దాంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాయ్‌కి గత ఏడాది నవంబర్ నెలలో అపరిచిత వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. సిటీ బ్యాంకు అధికారులం అని పరిచయం చేసుకున్నారు. మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది. కానీ తరువాత ప్రాసెస్ కోసం మీ మొబైల్ నెట్‌వర్క్ మార్చుకోవాలని చెబితే టెకీ రాయ్ అది నిజమని నమ్మారు. ఈ క్రమంలో డిసెంబర్ 1వ తేదీన సైబర్ నేరగాళ్లు ఆ టెకీకి రెడ్‌మీ మొబైల్ గిఫ్టుగా పంపించారు. మీ క్రెడిట్ కార్డు అప్రూవల్ మీద ఆఫర్ వచ్చిందని చెబితే నిజమనుకున్నాడు. ఈ ఫోన్లో సిమ్ కార్డ్ వేసుకోవాలని సూచించగా అలాగే చేశాడు. ఇంకేముంది సిమ్ వేసుకుని అన్ని వివరాలు ఎంటర్ చేయగా.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.
 
పోలీసులకు బాధితుడు ఫిర్యాడు
‘బ్యాంకు అధికారులం అంటూ నాకు మెస్సేజ్ వచ్చింది. క్రెడిట్ కార్డు ప్రాసెస్ పూర్తయిందని, ఆఫర్ కింద మొబైల్ వచ్చిందని చెప్పారు. అందులో సిమ్ కార్డ్ వేసుకోవాలని మెస్సేజ్ రాగా, అదేరోజు కొత్త ఫోన్లో సిమ్ వేశాను. ఆ తరువాత నాకు బ్యాంకు నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు, మెస్సేజ్ లు రాలేదు. కానీ చాలా రోజుల తరువాత బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.2.8 కోట్లు డెబిట్ అయినట్లు చూపించిందని’ టెకీ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైట్ ఫీల్డ్ సెన్ పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

వైట్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ మాట్లాడుతూ.. టెకీ ఫోన్ నెంబర్ క్లోన్ చేసి సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసుకుని ఉండొచ్చు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఎవరైనా మీకు క్రెడిట్ కార్డు వచ్చిందనో, క్యాష్ బ్యాక్ వచ్చిందనో, లోన్ ఆఫర్ అనగానే నమ్మవద్దని.. మీ ఓటీపీ, పాస్ వర్డ్ లాంటివి అసలు షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. లేకపోలే ఆఫర్ల పేరిట, క్యాష్ బ్యాక్ పేరుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. 

Also Read: Rajasthan: ఛీ ఛీ పాఠశాలలో ఇదేం పని – ఏకంగా స్కూల్లోనే ముద్దులు పెట్టుకున్నారు, ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు

మరిన్ని చూడండి

Source link