ఢిల్లీ ముస్తఫాబాద్ భవనం కూలిపోయింది: ఢిల్లీలోని న్యూ ముస్తఫాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో 8 నుంచి 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే NDRF, అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్ మొదట కూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
న్యూ ముస్తఫాబాద్‌లోని శక్తి విహార్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కూలిపోయినట్లు శుక్రవారం రాత్రి 2:50 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 40 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అథ్వాల్ మాట్లాడుతూ. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2:50 గంటలకు ఒక బిల్డింగ్ కూలిపోయినట్లు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాం. మొత్తం భవనం కూలిపోగా, కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు గుర్తించాము. NDRF టీమ్, ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయిని తెలిపారు.
#WATCH दिल्ली: मुस्तफाबाद इलाके में एक इमारत गिरने से 4 लोगों की मृत्यु हो गई, बचाव और तलाशी अभियान जारी है।
उत्तर पूर्वी जिले के एडिशनल डीसीपी संदीप लांबा ने बताया कि 8-10 लोगों के अभी भी फंसे होने की आशंका है। pic.twitter.com/3BGTjxpXKK
— ANI_HindiNews (@AHindinews) April 19, 2025
శిథిలాల కింద మరో 10 మంది..
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకూ 10 మందిని శిథిలాల నుంచి బయటకు తీయగా అందులో నలుగురు మరణించారు. ఈశాన్య జిల్లా అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా మాట్లాడుతూ.. శిథిలాలలో ఇంకా 10 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. కుప్పకూలిన ఆ 4 అంతస్తుల భవనంలో దాదాపు 20 మంది వరకు నివసిస్తున్నారు. భవనం కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలుస్తోంది. అధికారులు దాన్ని బట్టి అసలేం జరిగిందో ఓ అంచనాకు రానున్నారు.
మృతులలో ఒకరి బంధువు షహజాద్ అహ్మద్ మాట్లాడుతూ, “ఈ బిల్డింగ్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత దాదాపు 2.30 గంటలకు కూలిపోయింది. ఇది 4 అంతస్తుల భవనం. నా ఇద్దరు మేనల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారు. నా సోదరి, బావతో పాటు మేనకోడలు కూడా గాయపడ్డారు. వారిని జిటిబి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అని తెలిపారు. భవనం కూలిపోయిన ప్రమాదంతో ఒక ప్రత్యక్ష సాక్షి స్పందించారు. “భవనంలో ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాలు, అద్దెకు ఉంటున్నవారు నివసిస్తున్నారు. పెద్ద కోడలుకు ముగ్గురు పిల్లలు, చిన్న కోడలుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ వారు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా శిథిలాల కిందే ఉన్నారా, ప్రాణాలతో బయట పడతారా తెలియడం లేదన్నారు.
మరిన్ని చూడండి