Delhi Crime News:
ఢిల్లీలో హత్య..
దేశ రాజధాని ఢిల్లీ ఒళ్లు జలదరించే క్రైమ్ జరిగింది. గీతా కాలనీలోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో ఓ మహిళ శరీర భాగాలు కనిపించడం సంచలనమైంది. శ్రద్ధా వాకర్ దారుణంగా హత్య చేసిన కేసు నుంచే ఇంకా కోలుకోక ముందే దాదాపు అలాంటి నేరమే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్ దగ్గర్లో పడేశారు దుండగులు. ఇవాళ ఉదయం (జులై 12) 9 గంటలకు పోలీసులకు ఈ సమాచారం అందింది. శరీర భాగాలు ఒక్కోటి ఒక్కో చోట పడేసి ఉన్నాయి. ఆమె తలని స్వాధీనం చేసుకున్నారు. మిగతా శరీర భాగాల కోసం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ తరహా నేరాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. హత్య చేయడమే కాకుండా బాడీని ముక్కలుగా నరికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. సాక్ష్యాధారాలు దొరక్కుండా నేరస్థులు ఇలా జాగ్రత్త పడుతున్నారు. ఈ కేస్‌లను డీల్ చేయడంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో రెండు ప్లాస్టిక్ బ్యాగ్‌లు దొరికాయని పోలీసులు వెల్లడించారు.
“రెండు బ్లాక్ పాలిథీన్ బ్యాగ్‌లు కనిపించాయి. ఓ బ్యాగ్‌లో మహిళ తల ఉంది. మరో సంచిలో మిగతా శరీర భాగాలున్నాయి. జుట్టు చాలా పొడవుగా ఉండడం వల్ల చనిపోయింది మహిళే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చాం. మహిళా కాదా అన్నది పూర్తి విచారణ తరవాతే తెలుస్తుంది”
– పోలీసులు
#WATCH | Delhi: Two black polythene bags have been found. One polythene contains the head of the body and the other polythene contains other parts of the body. On the basis of long hair, we are assuming that it is the body of a woman. It is yet to be identified, probe underway:… https://t.co/C5stJpUwHj pic.twitter.com/ARMGleSsSU
— ANI (@ANI) July 12, 2023
ముంబయిలోనూ ఇదే తరహాలో..
ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్ గురించి తెలియలేదు. అప్పటికే స్పాట్లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్ హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు.
Also Read: బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు కొట్టిన టీచర్, విద్యార్థి ఆత్మహత్య