Did Elon Musk cry in a TV interview over Tesla stock crash | Elon Musk: దారుణంగా పడిపోతున్న టెస్లా షేర్ – టీవీ ఇంటర్యూలో కన్నీరు పెట్టుకున్న ఎలాన్ మస్క్

Did Elon Musk cry :టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కరిగిపోతున్న తన  సంపదను తల్చుకుని కన్నీరు పెట్టుకున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అమెరికా బిజినెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో  తన కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెప్పేటప్పుడు అతని కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి.  టెస్లా స్టాక్ 15.4% పడిపోయి, సెప్టెంబర్ 2020 తర్వాత అతిపెద్ద తగ్గుదలను సూచిస్తుండటంతో, బహుళ వ్యాపారాలను నిర్వహించడం “చాలా కష్టంగా” మారిందని మస్క్ అంగీకరించారు. అదే సమయంలో ఎక్స్ లో వస్తున్న సాంకేతిక సమస్యలు కూడా సవాల ్గా మారుతున్నాయి.  ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్‌లో ప్రపంచవ్యాప్త  మాంద్యం  టెస్లా సమస్యలను మరింత పెంచింది. 
 
ఇంటర్వ్యూ నుండి ఒక క్లిప్ X లో వైరల్ అయింది. అందులో  ఎలోన్ దాదాపు ఏడుస్తున్నట్లుగా ఉన్నారు.  SpaceX ఎందుకు పదే పదే విఫలం అవుతోందని ఇంటర్యూ చేసే వ్యక్తి ప్రశ్నించినప్పుడు .. నెవర్ గివ్ అప్ అని సమాధానం  ఇచ్చారు.  ఇంటర్వ్యూ  మొదట్లో  DOGE  కింద బడ్జెట్ కోతలపై మాట్లాడుతున్నప్పుడు ఇతర వ్యాపకాలు, వ్యాపారాలను వదిలేశారా అన్న ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన అది చాలా కష్టమని సమాధానం ఇచ్చారు. 

ఎలాన్ మస్క్ ఒక్క నెలలోనే ఆయన 180 బిలియన్ డాలర్లకుపైగా  సంపద కోల్పోయారు. ఇది దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలతో  సమానం అనుకోవచ్చు.  ఈ ఏడాది జనవరి చివరికి  మస్క్ నెట్ వర్త్ 486 బిలియన్ డాలర్లు. ఈ సోమవారం దాని విలువ 301 బిలియన్ డాలర్లు. అంటే నెలన్నర కాక ముందే ఆయన 180 బిలియన్ డాలర్లు నష్టపోయారు.  స్పేస్‌ఎక్స్ హోల్డింగ్‌లలతో పాటు  టెస్లా, ట్విట్టర్, xAI, ది బోరింగ్ కంపెనీ మరియు న్యూరాలింక్‌లలో భారీగా వాటాలు ఎలాన్ మస్క్ దగ్గరే ఉన్నాయి. వీటి షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి.   

 చైనాకు చెందిన డీప్‌సీక్ AI పరిశ్రమలో సంచలనం సృష్టించిన తర్వాత  ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు తగ్గిపోతూ వస్తున్నాయి.  టెస్లా ఆటోమొబైల్ కంపెనీ షేర్లు గత నెల రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్నాయి. సోమవారం మరింతగా పడిపోయాయి.  టెస్లా షేర్ ఈ ఏడాదిలో ఓ రోజు 488 డాలర్లు ఉంది. ఇప్పుడు షేర్ విలువ కేవలం 230 డాలర్లు మాత్రమే. అంటే సగానికి పడిపోయింది.టెస్లా కార్ల అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. అందుకే ట్రంప్ తాను టెస్లా కారు కొంటానంటూ ప్రకటించారు.                   

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link