Did Trisha Hike Her Remuneration పారితోషకం పెంచేసిన త్రిష

ప్రస్తుతం నటి త్రిష టైం నడుస్తుంది. పొన్నియన్ సెల్వన్ వరకు త్రిష కెరీర్ డౌన్ అయ్యింది, ఆమె పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే ప్రచారం కూడా జరిగింది. మధ్యలో 96 చిత్రం హిట్ అయినా.. ఆతర్వాత ఆమె నుంచి వచ్చిన హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అన్ని ఢమాల్ అన్నాయి. అయినా మణిరత్నం త్రిష కి పొన్నియన్ సెల్వన్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నారు. ఆ చిత్రం తర్వాత త్రిష టైం స్టార్ట్ అయ్యింది. 

వరసగా క్రేజీ స్టార్ హీరోల ఆఫర్స్ ఆమె ముందుకు వచ్చాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, కమల్ హాసన్ తో థగ్ లైఫ్, అజిత్ విడాయుమర్చి, మోహన్ లాల్ రామ్ లో నటిస్తోంది. మరి ఈ నలుగురు హీరోలు చిన్న హీరోలు కాదు. వరస అవకాశాలతో డైరీ ఫుల్.. అయినా త్రిష కోసం ప్రయత్నం చేసే దర్శకులు ఎంతో మంది ఉన్నారట. అందుకే త్రిష కూడా తన పారితోషకం పెంచేసింది అనే టాక్ సౌత్ మీడియాలో వైరల్ గా మారింది. 

కమల్ హాసన్ తో చేస్తున్న థగ్ లైఫ్ కోసం త్రిష భారీగా పారితోషకం అంటే దాదాపుగా 12కోట్లు డిమాండ్ చేసిందట. అయితే త్రిష అంతగా డిమాండ్ చెయ్యడానికి కారణం థగ్ లైఫ్ కి ఎక్కువ మొత్తం డేట్స్ కేటాయించాల్సి రావడం, మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యే అవకాశం లేకపోవడంతో త్రిష ఆమేరకు డిమాండ్ చెయ్యడం మేకర్స్ కూడా ఒప్పుకోవడం జరిగిందట. ఈ లెక్కన ఏ యేపారితోషకమే త్రిష అందుకుంటే అప్పుడు ఆమె సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా మారుతుంది. మరి మిగతా విశ్వంభర, విడాయుమర్చి, రామ్ కి మాత్రం అంత అందుకోకపోవచ్చని అంటున్నారు. 

ఇది చూసిన వారంతా ప్రస్తుతం త్రిషకి డిమాండ్ ఉంది. అందుకే ఆమె పారితోషకం పెంచేసింది.. ఇందులో తప్పేముందిలే అంటున్నారు. 

Source link