Director Krish who applied for bail? బెయిల్ కోసం అప్లై చేసిన డైరెక్టర్ క్రిష్?


Fri 01st Mar 2024 12:29 PM

director krish  బెయిల్ కోసం అప్లై చేసిన డైరెక్టర్ క్రిష్?


Director Krish who applied for bail? బెయిల్ కోసం అప్లై చేసిన డైరెక్టర్ క్రిష్?

గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు ఇండస్ట్రీ చుట్టూనే తిరుగుతుంది. గతంలో ఇలాంటి డ్రగ్స్ కేసులు ఇండస్ట్రీలో నడిచాయి. చివరికి అవి నిరాధారాలని తేలిపోయాయి. కానీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కనిపిస్తున్నాయి. ఈ కేసులో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కొడుకు ఉన్నాడని, దర్శకుడి క్రిష్ ఇప్పటికే ఈకేసులో A10 ముద్దాయిగా పోలీసులు FIR నమోదు చేసారు. దర్శకుడు క్రిష్ ఈ పార్టీలో డ్రగ్స్ సేవించాడు అని పోలీసులు చెబుతున్నారు.

క్రిష్ హోటల్ పై పోలీస్ రైడ్ జరగ్గానే ముంబై వెళ్లిపోయాడని, అప్పుడు క్రిష్ పై పరారీ వార్తలు స్ప్రెడ్ అవడంతో సోషల్ మీడియా వేదికగా ఈకేసుపై స్పందించాడు. తాను ఆ హోటల్ కి వెళ్ళాను, పార్టీలో లేను అని చెప్పాడు. కానీ పోలీసులు క్రిష్ ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా క్రిష్ వివేక్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. విచాణకు పిలవగా తాను ముంబై లో ఉన్నాను, రెండు రోజుల వరకు విచారణకు రాలేను అని పోలీసులకి చెప్పాడంటున్నారు. 

అయితే క్రిష్ ఈ రెండు రోజుల సమయాన్ని పోలీసుల విచారణకు వెళ్లకుండా ముంబైలోనే ఉండి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సోషల్ మీడియా టాక్. మరోపక్క ప్రముఖ నిర్మాత కొడుకు ఇండియా వదిలి అమెరికా  చెక్కేశాడని అంటున్నారు. అత‌డికి అమెరికా పౌర‌స‌త్వం ఉండ‌డంతో అక్క‌డ త‌ల‌దాచుకునేందుకు పారిపోయాడ‌ని పోలీసులు గుర్తించిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే క్రిష్ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్న అనే అనుమానం అందరిలో మొదలయ్యింది.


Director Krish who applied for bail?:

Director Krish Seeks Anticipatory Bail In Drugs Case





Source link