ByGanesh
Sat 30th Nov 2024 06:04 PM
రామ్ చరణ్ RC16 సినిమా షూటింగ్‌ను మైసూర్‌లో ప్రారంభించారు. తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలోకి భారీ తారాగణం కూడా నటిస్తున్నారు. కరుణడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన చాలా పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించబోతున్నారు.
తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ దివ్యేందు ఇందులో కీలక పాత్రలో అలరించబోతున్నారు. మీర్జాపూర్‌లో మున్నాభాయ్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దివ్యేందు RC16తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ముఖ్య పాత్రలో మెప్పించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు దివ్యేందు పాత్రకు సంబంధించి స్పందిస్తూ తనకు RC16 ఎంతో ఇష్టమైన పాత్ర ఇదేనని పేర్కొంటూ తన లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెలి తిప్పిన మీసం, రగ్డ్ లుక్‌తో దివ్యేందు సరికొత్త పాత్రలో మెప్పించబోతున్నారని స్పష్టమవుతుంది.
RC16 చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా మెప్పించనున్నారు. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
Divyenndu Comes Onboard For RC16:
Divyenndu Comes Onboard For Ram Charan And Buchi Babu Sana RC16