DMK Comments On Pawan Statement: తమిళనాడులో చెలరేగిన హిందీ భాషా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దీనిపై తీవ్రంగా స్పందించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర గురించి పవన్ కల్యాణ్ అజ్ఞానం బయటపడిందని ఆరోపించింది. పవన్ వ్యాఖ్యలను DMK నాయకుడు TKS ఎలంగోవన్ తోసిపుచ్చారు. తమిళనాడు 1938 నుంచి హిందీ భాష అమలును వ్యతిరేకిస్తోందని అ్నారు. తమిళనాడు నటుల అభిప్రాయాల ఆధారంగా కాకుండా నిపుణుల సలహా ఆధారంగా ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ DCM పవన్ కల్యాణ్ ప్రకటనపై DMK నాయకుడు TKS ఎలంగోవన్ ANIతో మాట్లాడుతూ, “మేము 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాము. నటుల కాదు, విద్యానిపుణుల సలహాలు, సూచనలతో తమిళనాడు ఎల్లప్పుడూ ద్వి భాషా సూత్రాన్ని అనుసరిస్తుందని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాం. పవన్ కల్యాణ్ పుట్టక ముందే 1968లో ఈ బిల్లు ఆమోదం పొందింది.”
పవన్‌కు తమిళనాడు రాజకీయాలు తెలియవు
“మాతృభాషలో విద్యను బోధించడం ఉత్తమ మార్గం అని మేము భావిస్తున్నందున మేము హిందీని వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. బిజెపి ప్రభుత్వం నుంచి ఏదైనా పొందగలిగేలా ఆయన (పవన్ కళ్యాణ్) ఏదో ఒక విధంగా బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు” అని ఆయన అన్నారు.
పవన్ ఏమన్నారంటే…
మార్చి 14, 2025న పిఠాపురంలో జయకేతనం పేరుతో జరిగిన జనసేన ప్లీనరీలో మాట్లాడిన పవన్ కల్యాణ్ తమిళనాడు లేవనెత్తే చాలా వివాదలపై స్పందించారు. ఇలాంటి భారత దేశానికి మంచివి కావని కూర్చొని మాట్లాడుకునే దానికి ఎందు విధ్వంసం సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో అన్ని భాషలను గౌరవించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలమని అభిప్రాయపడ్డారు. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోవాలని సూచించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయాలని సలహా ఇచ్చారు. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి కానీ వారి భాష మాకొద్దు అంటే ఎలా అని ప్రస్నించారు. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదని అన్నారు. సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని ఎలా చెబుతారని నిలదీసారు. సంస్కృతం దేవ భాషని హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారని తెలియజేశారు. ఇస్లాం ప్రార్థనలు అరబిక్‌లో ఉంటాయని… కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఎందుకి ప్రస్నించారు. భాషల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి కూడా క్లిష్టమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి సింబర్‌ను బడ్జెట్ నుంచి తొలగిస్తే రాష్ట్రానికో పద్ధతి పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందారు. ఇది దేశానికి మంచిది కాదని హితవు పలికారు.
ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని పవన్ సలహా ఇచ్చారు. అంతేగాని దేశం ఏమైనా కేకు ముక్కలా కోసుకొని పంచుకోవడానికి అని అన్నారు. ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటీ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీలాంటి వాళ్లు విడిపోతే నాలాంటి వాళ్లు కలపడానికి కోట్ల మంది వస్తారని హెచ్చరించారు.
మరిన్ని చూడండి