Story Behind Name of Pakistan | బ్రిటీష్ ఇండియాలో పాక్ భూబాగమంతా ఇండియాలో భాగంగా ఉండేది. 1947 ఆగష్టు 14 న పాకిస్థాన్ దేశంగా అవతరించింది. లార్ట్ మౌంట్ బాటన్ భారత దేశానికి పరిపాలన పగ్గాలు అప్పగించే ప్రణాళికలో దేశ విభజన అంశం కూడా పొందుపరిచారు. అయితే పాకిస్థాన్ ఏర్పాటుకు మహమ్మద్ అలీ జిన్నా మూల కారకుడు. భారత జాతీయ కాంగ్రెస్ లో జిన్నా ఒకప్పుడు సభ్యుడయినా ఆ తర్వాత గాంధీ సిద్ధాంతాలు, ముస్లిం లకు ప్రత్యేక హక్కులు ఉండాలన్న తన వాదనతో వారితో విబేధించి ముస్లిం లీగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ముస్లింల హక్కులే ధ్యేయంగా స్వాతంత్రోద్యమ కాలంలో పని చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ముస్లింలకు ప్రత్యేక రాజ్యం ఉండాలన్న డిమాండ్ తో హింసాకాండకు దిగారు. ఆ తరుణంలో అప్పటి బ్రిటిష్ పాలకులు భారత ఉపఖండం రెండు దేశాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం మెజార్టీ ప్రజలకు ఓ దేశం, హిందు, సిక్కు, జైనులు, ఇతర అల్ప సంఖ్యాక వర్గాల వారందరికి ఓ దేశం ఉండాలని దేశ విభజన నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్థాన్ అనే పేరు అర్థం ఇదే
పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు. ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఓ డిక్లరేషన్ ను ప్రతిపాదించారు. ఆందులో ఈ పాకిస్థాన్ అనే పదం వాాడారు. అయితే ఇతను లండన్ లో ఉండేవాడు. చివరకు పాకిస్థాన్ దేశం ఏర్పడినా లండన్ లోనే నివాసం ఉండి అక్కడే మరణించారు. పాక్ అనే పదం ఉర్దూ, పర్షియా భాషల్లో పరిపూర్ణత లేదా శుద్దత అనే అర్థం వస్తుంది. ఇస్తాన్ అనే దానికి భూమి లేదా దేశం అనే అర్థం వస్తుంది. అయితే పాకిస్థాన్ అనే పదంకు కింది అర్థాలను కూడా చెప్పుకుంటారు.
P – Punjab (పంజాబ్)
A – Afghania (అఫ్ఘానియా) లేదా బలూచిస్తాన్ (Balochistan)
K – Kashmir (కశ్మీర్)
S – Sindh (సింధ్)
ఈ అర్థంతో పాకిస్థాన్ ఏర్పడిందన్న ప్రచారం ఉంది. అయితే పాకిస్థాన్ ప్రధానంగా పంజాబ్, సింధ్, బలుచిస్థాన్, ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రాంతాలతో ఏర్పడింది. 1971 లో బంగ్లాదేశ్ ఓ దేశంగా ఏర్పడక ముందు పాకిస్థాన్ లో భాగంగా ఉండేది. పాకిస్థాన్ లోని ప్రస్తుత ప్రదేశాలన్నీ బ్రిటీష్ ఇండియాలో అనేక ప్రావిన్స్ లలో భాగమై ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఆనాడు పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేది. మన దేశంలో ఆనాడు ఇది ఓ పెద్ద ప్రావిన్సు గా పరిగణించబడేది. విభజన సమయంలో రెండుగా విడిపోయింది. పాకిస్తాన్ లోని పంజాబ్ గా, భారత్ లో పంజాబ్ గా ఇది విభజించబడింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలో సింధ్ ప్రావిన్సుగా పరిగణించబడేది. బలుచిస్థాన్ బ్రిటీష్ ఇండియాలో భాగం. ఇప్పుడు పాకిస్థాన్ లో భాగమైంది. ఖైబర్ ఫక్తూన్ ఖ్వా బ్రిటీష్ ఇండియాలో అప్ఘన్ మాతా ప్రాంతంలో భాగమై ఉండేది. పాకిస్థాన్ లోని కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేవి. ఇప్పుడు పాక్ లో భాగమయ్యాయి.
జిన్నా పాకిస్థాన్ అనే పేరును ఎప్పుడు ఆమోదించారు ?
పాకిస్థాన్ నిర్మాతగా మహమ్మద్ ఆలీ జిన్నాను పిలుస్తారుత. 1933 లో చౌదరీ రహమత్ అలీ పాకిస్థాన్ అనే పదాన్ని తొలి సారి ప్రస్తావనకు తెచ్చినప్పటికీ ఆలీ జిన్నా ఆమోదం తర్వాతే విశేష ప్రాచుర్యంలోకి వచ్చింది. 1940 లో పాకిస్థాన్ అనే దేశం ముస్లింల కోసం ఏర్పడాలన్న తీర్మానంపై ముస్లింలీగ్ కోల్ కత్తాలో సమావేశమయింది. లాహోర్ డిక్లరేషన్ దీన్నే లాహోర్ తీర్మానం అంటారు. జిన్నా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముస్లింల కోసం ఏర్పడే దేశానికి పాకిస్థాన్ అనే పేరు పెట్టాలని అధికారికంగా ప్రకటించారు. ఇలా మొదలయిన దేశ విభజన ఉద్యమ ఫలితంగా 1947లో పాకిస్థాన్ ఏర్పాటయింది.
Also Read: Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
మరిన్ని చూడండి