doctor forget surgical needle in woman head while surgery in uttarpradesh latest telugu news | Crime News: యువతి తలలో సూది మర్చిపోయి కుట్లేసిన డాక్టర్

Doctor Forgets Surgical Needle In Woman Head In UP: ఉత్తరప్రదేశ్‌లో (Uttarapradesh) దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ వివాదంలో సర్జరీ చేసి యువతి తలలోనే సూదిని మర్చిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని హాపూర్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దాడికి దిగడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లగా పరీక్షించిన వైద్యులు చికిత్స చేసి తలకు కుట్లు వేసి పంపారు. ఇంటికి వెళ్లిన అనంతరం యువతికి తీవ్రంగా తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు యువతికి చికిత్స చేస్తుండగా తలలో సూదిని చూసి షాక్ అయ్యారు. వెంటనే దాన్ని తొలగించి కుట్లు వేశారు.

విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. చికిత్స చేసిన సమయంలో వైద్యుడు మద్యం మత్తులో ఉన్నందునే ఇలా జరిగినట్లు ఆరోపించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హాపూర్ జిల్లా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ సునీల్ త్యాగి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read: Work Stress: ’45 రోజులు నిద్ర లేకుండా పని చేశా’ – పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య, భార్యకు 5 పేజీల సూసైడ్ నోట్

మరిన్ని చూడండి

Source link