Dolphin committed suicide : అమెరికాలో పీటర్ అనే మగ డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకుంది. అది సముద్రంలో పెరిగింది కాదు.త భారీ అక్వేరియంలో నాసా ఓ ప్రయోగంలో భాగంగా దాన్ని పెంచింది. మానవులకు డాల్ఫిన్స్ కు మధ్య అనుబంధం పెంచడం, భాషను అర్థం చేసుకునేలా ఓ ప్రాజెక్టును నాసా చేపట్టింది. అందులో భాగంగా మగ డాల్ఫిన్ కు పీటర్ అని పేరు పెట్టి దానికి ట్రైనల్ గా మార్గరేట్ శిక్షకురాలిని నియమించారు. అమెరికన్ న్యూరో సైంటిస్ట్ జాన్ లిల్లీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రయోగం మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చే దిశగానే వెళ్లింది. ఈ పరిశోధన ‘డాల్ఫినారియం’ అనే ఒక ప్రత్యేకమైన అక్వేరియంలో నిర్వహించారు. ఇందులో ట్రైనర్ మార్గరేట్, డాల్ఫిన్ పీటర్ మూడు నెలలు ఉన్నారు.
ట్రైనర్ మార్గరేట్ కు న్యూరో సైంటిస్ట్ జాన్ లిల్లీ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ డాల్ఫిన్ తో అనుబంధం పెంచుకునేలా చేశారు. మొదట్లో మగ డాల్ఫిన్ పీటర్ బాగానే స్పందించేది. అయితే రాను రాను అది మార్గరేట్ పై లైంగిక కోరికలు వ్యక్తం చేయడం ప్రారంభించింది. మార్గరేట్ తో శారరీక సంబంధం పెట్టుకునేందుకు అదే పనిగా ప్రయత్నించింది. ఇదే సమయంలో ఆ డాల్ఫిన్ కు.. ఆడ డాల్ఫిన్లతో గడిపేందుకు అవకాసశం కల్పించారు. కానీ పీటర్ మాత్రం ఆడ డాల్ఫిన్లతో సంపర్కానికి ఎలాంటి ఆసక్తి చూపించలేదు. ఎంత సేపు మనిషి అయిన మార్గరేట్ తో అయితేనే సౌకర్యంగా ఉండేది.
రాను రాను డాల్ఫిన్ పీటర్ మొరటుగా ప్రవర్తించడం ప్రారంభించింది. అయితే వీలైనంత వరకూ ఆ డాల్ఫిన్ ను సంతోషంగా ఉంచేందుకు మార్గరేట్ ప్రయత్నించింది. కానీ రాను రాను మరింత మొరటగా మారడంతో ఇక ఈ ప్రయోగాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. పీటర్ మొరటుగా మారనంత వరకు నాకు దానితో అసౌకర్యంగా అనిపించలేదు..కానీ రాను రాను దాన్ని భరించడం కష్టంగా మారిందని మార్గరేట్ చెప్పారు. ప్రయోగం వెనుక శాస్త్రీయ ఆశయం ఉన్నప్పటికీ, మార్గరేట్ తో పీట్ అసాధారణ చర్యలతో ఇబ్బందికరంగా మారింది. ఈ పరిశోధన దారి తప్పిందని బయటకు రావడంతో ప్రభుత్వం నిధులు ఆపేసింది. చివరికి ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
హఠాత్తుగా మార్గరేట్ కనిపించడం మానేయడంతో పీటర్ విషాదంలో మునిగిపోయింది. డల్ గా ఉండేది. అందుకే దాన్ని వాతావరణ మార్పు కోసం వేరే పెద్ద అక్వేరియానికి తరలించారు. అయినా ఎవరితోనూా కలవలేకపోయాడు. పీటర్ సూర్యరశ్మికి తక్కువగా గురయ్యే చాలా చిన్న, మూసివున్న ట్యాంకుకు పరిమితం అయ్యేవాడు. చివరికి పీటర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మార్గరేట్ కు సమాచారం వచ్చింది. డాల్ఫిన్లు తమ జీవితాలను ఎలా అంతం చేసుకుంటాయి. డాల్ఫిన్లు మనలాగే ఆటోమేటిక్ గాలి పీల్చుకునేవి కావు. జీవితం చాలా భరించలేనిదిగా మారితే, డాల్ఫిన్లు ఊపిరి పీల్చుకోవడం ఆపేసి.. అడుగున ప్రాణాలు వదులుతాయి. మార్గరేట్ తో విడిపోయిన బాధతోనే పీటర్ ఆత్మహత్య చేసుకుందని గుర్తించారు.
అయితే ఈ పరిశోదన ఇప్పుడు జరిగింది కాదు. 1960లలో జరిగింది. మార్గరేట్ కొన్ని ఇంటర్యూలలో ఈ విషయం చెప్పడంతో విషయం బయటపడింది.
Also Read: అదృష్టం వరించినా దరిద్రం వదలకపోవడం అంటే ఇదే – చెత్త పాలైన 6.5 వేల కోట్ల బిట్ కాయిన్ హార్డ్ డ్రైవ్ – 12 ఏళ్లు వెదికినా దొరకలేదు !
మరిన్ని చూడండి