DVV increases expectations on OG OG టైటిల్ అదే ఫిక్స్


Fri 04th Aug 2023 05:22 PM

dvv,og  OG టైటిల్ అదే ఫిక్స్


DVV increases expectations on OG OG టైటిల్ అదే ఫిక్స్

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే మాములు విషయం కాదు. సాహో తో ప్లాప్ కొట్టి ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న దర్శకుడు సుజిత్.. పవర్ స్టార్ తో చేస్తున్న చిత్రాన్ని ఆషామాషీగా కాకుండా.. ఓ రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నాడు. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ టైటిల్ గా మొదటినుండి OG అంటూ పిలవడం స్టార్ట్ చేసారు. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని అర్హం. అయితే ఈ చిత్రానికి OG అనే ఉంచేస్తారా లేదంటే ఏదైనా టైటిల్ మారుస్తారా అని పవన్ ఫాన్స్ ఆతృతగా కనిపిస్తున్నారు. 

అందులో భాగంగానే ఓ అభిమాని సోషల్ మీడియాలో OG కి భయ్యా టైటిల్ ఇదే ఉంచండి.. ఒకవేళ మార్చాలని ఆలోచన ఉన్నప్పటికీ దానిని మార్చకండి అంటూ ట్వీట్ చేశాడు. దానికి దానయ్య అండ్ కో వెంటనే రిప్లై ఇచ్చేసింది. ఏం లేదు ఇదే. దే కాల్ హిమ్ OG అంటూ ఇచ్చిన క్లారిటీతో ఇకపై పవన్ కళ్యాణ్-సుజిత్ మూవీ టైటిల్ గా OG నే ఫిక్స్ అయ్యిపోండి అంటూ పవన్ ఫాన్స్ సరదా పడుతున్నారు. 

సుజిత్ ఈ చిత్రాన్ని ఎలాగైనా డిసెంబర్ లోనే విడుదల చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా వీలున్నప్పుడల్లా దీనికి డేట్స్ కేటాయిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్, అర్జున్ దాస్ లాంటి పలు భాషా క్రేజీ నటులు భాగమవుతున్నారు. సుజిత్ పవన్ OG ని ప్యాన్  ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు పకడ్బందీగా ఏరాట్లు చేసుకుంటున్నాడు. 


DVV increases expectations on OG:

DVV daring take on OG





Source link