డిసెంబర్ మాసం మొదటి వారంలో తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం 7:30 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరించింది. దీని ప్రభావంతో… ములుగు, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.