Earthquake North Atlantic Ocean Of Magnitude 6.4 Hits On Richter Scale Know Details | Earthquake North Atlantic Ocean: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ భూకంపం

Earthquake North Atlantic Ocean: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు ఉన్నట్టుండి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4గా తీవ్రత నమోదైంది. సముద్ర గర్భంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. అయితే ఇప్పటికి ఇప్పుడు దీని వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని కూడా వెల్లడించింది. ఇక్కడే కాకుండా ఆంటిగ్వా, బార్భుడాలో కూడా భారీ భూకంపం సంభవించింది. మంగళ వారం రోజు తెల్లవారు జామున 2.28 గంటలకు భూమి కంపించిందని యూఎస్జీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 6.6గా నమోదు అయిందని కాండ్రింగ్టన్ కు 274 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వివరించింది. 

Source link