ED to question Mahesh Babu హీరో మహేష్ బాబుకు ED నోటీసులు


Tue 22nd Apr 2025 09:36 AM

mahesh babu  హీరో మహేష్ బాబుకు ED నోటీసులు


ED to question Mahesh Babu హీరో మహేష్ బాబుకు ED నోటీసులు

వివాదాలకు దూరంగా, తన పని తను చేసుకునే హీరో మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. రాజమౌళి తో చేస్తోన్న SSMB 29 షూటింగ్ లో బిజీగా వున్న మహేష్ బాబు కి ఈడీ నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన ప్రమోట్ చేసిన రియల్ ఎస్టేట్ గ్రూప్స్ సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ కు నోటీసులు జారీ చేసారు. 

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో ఆధారాలను సేకరించిన అధికారులు, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన ప్రమోషనల్ యాడ్స్ కి పారితోషికం రూపంలో మహేష్ బాబు రూ.5.9 కోట్లు  తీసుకున్నట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో మహేష్ తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించడంతో మహేష్ కు ఈడీ అధికారులు నోటీసులు జేరి చేసినట్లుగా తెలుస్తుంది. 

మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి అని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని, రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు, ఈనెల 27న విచారణకు రావాలనీ ఆ నోటీసులో పేర్కొన్నారు. 


ED to question Mahesh Babu:

Mahesh Babu gets ED shock





Source link