Egyptians Tried To Treat Cancer 4000 Year Old Skull Shows

Egyptians Treatment For Cancer: క్యాన్సర్‌ని కట్టడి చేసేందుకు ఇప్పుడే ఇంత ఇబ్బంది పడుతున్నాం. రకరకాల ట్రీట్‌మెంట్‌లతో కొంత వరకూ నయం చేయగలుగుతున్నాం. ఈ స్థాయిలో సాంకేతికత ఉన్నా ఇంకా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ…ఏ టెక్నాలజీ లేని వేలాది ఏళ్ల క్రితమే ఈజిప్టియన్‌లు క్యాన్సర్‌కి చికిత్స అందించారు. 4 వేల ఏళ్ల క్రితం నాటి ఓ పుర్రెని కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ విషయం వెల్లడించారు. Frontiers in Medicine జర్నల్‌లో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. జర్మనీలోని టుబింగెన్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలకు చెందిన రీసెర్చర్స్‌ ఈ విషయం వెల్లడించారు. అప్పట్లోనే బ్రెయిన్ ట్యూమర్‌ ఉన్నట్టు గుర్తించారు. అప్పట్లోనే ఈ వ్యాధి ఉందనడానికి ఇదే సాక్ష్యం అని స్పష్టం చేశారు. అయితే…అప్పట్లో క్యాన్సర్ కణాలు ఎలా ఉండేవి..? అప్పటి మనుషులపై ఎలాంటి ప్రభావం చూపించింది అనేది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. 

Cancer Treatment: వేల ఏళ్ల క్రితమే క్యాన్సర్‌కి చికిత్స, ఈజిప్టియన్‌లు అద్భుతాలు చేశారా?

వేల ఏళ్ల క్రితం ఈ క్యాన్సర్‌ వస్తే వాళ్లు ఎలా కట్టడి చేశారన్నదే ఆశ్చర్యకరంగా ఉంది ఈ రిపోర్ట్ వెల్లడించారు. 4 వేల ఏళ్ల క్రితం నాటి ఈ పుర్రె 30-35 ఏళ్ల పురుషుడిది అని తెలిపారు. మరో పుర్రె కూడా దొరికిందని అది 50 ఏళ్ల మహిళది అని వివరించారు. ఈ పుర్రెలపై అసాధారణంగా కణతులు పెరిగినట్టు గుర్తించారు. పుర్రె చుట్టూరా ఇలానే చిన్న చిన్న కణతులు ఉన్నట్టు రీసెర్చర్స్ తెలిపారు. మరో కీలక విషయం ఏంటంటే…ఆ టిష్యూస్ చుట్టూ కత్తిగాట్లు కనిపించాయి. అంటే…బలవంతంగా వాటిని తొలగించేందుకు కత్తిని వినియోగించి ఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే…పూర్తి స్థాయిలో వీటిపై రీసెర్చ్ చేయకుండా స్టేట్‌మెంట్‌లు ఇచ్చేయడం సరికాదని అన్నారు. 

“క్యాన్సర్ కణాలను తొలగించేందుకు ఈజిప్టియన్‌లు అప్పట్లో కత్తితో సర్జరీ చేసేందుకు ప్రయత్నించి ఉంటారు. ఈజిప్టియన్‌లు వ్యాధులను కట్టడి చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేశారనడానికి ఇదే సాక్ష్యం. ముఖ్యంగా క్యాన్సర్‌కి రకరకలా చికిత్సలు ప్రయత్నించి ఉంటారని అర్థమవుతోంది”

– పరిశోధకుడు 

 

మరిన్ని చూడండి

Source link