Eklavya Model Residential Schools Staff Selection Exam Notification Released, Check Posts Details Here

భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
   
వివ‌రాలు…

* మొత్తం ఖాళీలు: 4062

పోస్టుల వారీగా ఖాళీలు..

1) ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు 

అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు. 

జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు

అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.

3) అకౌంటెంట్‌: 361 పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.

4) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759

అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.19900-రూ.63200

5) ల్యాబ్‌ అటెండెంట్‌: 373

అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.18,000-రూ.56,900.

విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్. 

వయోపరిమితి: నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఇతరులకు 5 సంవత్సరాలు, ఈఎంఆర్ఎస్‌లలో ఇదివరకే శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారికి 55 సంవత్సరాల వరకు వెసులుబాటుల ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్-టీచింగ్ పోస్టులకు రూ.1000 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2023.

Notification

Information Bulletin & Guidelines

Apply for the Post of Principal Posts

Apply for the Post of PGT Posts

Apply for the Post of Non-Teaching Staff 

Website

ALSO READ:

ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్‌ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 14 స్పెషాలిటీ విభాగాల్లో నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link