Eluru District Crime News: ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం వెలుగు చూసింది. యువతిపై కత్తితో ఓ యువకుడు దాడికి దిగాడు. గొంతుకోసి హత్య చేశాడు. పైగా అతను కూడా కత్తితో మెడ కోసుకున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండగా…. ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.