Employees State Insurance Corporation Has Released Notification For The Recruitment Of Group-C Paramedical Posts

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

* మొత్తం పోస్టుల సంఖ్య: 1,038

పోస్టులు..

➦ ఈసీజీ టెక్నీషియన్

➦ జూనియర్ రేడియోగ్రాఫర్

➦ జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్

➦ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్

➦ ఓటీ అసిస్టెంట్

➦ ఫార్మసిస్ట్

➦ రేడియోగ్రాఫర్

➦ సోషల్ గైడ్/ సోషల్ వర్కర్ 

రీజియన్లవారీగా ఖాళీలు..

➥ బిహార్: 64

➥ చండీగఢ్, పంజాబ్: 32

➥ ఛత్తీస్‌గఢ్: 23

➥ ఢిల్లీ ఎన్‌సీఆర్‌: 27

➥ గుజరాత్: 72

➥ హిమాచల్ ప్రదేశ్: 06

➥ జమ్ము అండ్‌ కశ్మీర్: 09

➥ ఝార్ఖండ్: 17

➥ కర్ణాటక: 57

➥ కేరళ: 12

➥ మధ్యప్రదేశ్: 13

➥ మహారాష్ట్ర: 71

➥ నార్త్ ఈస్ట్: 13

 ➥ ఒడిశా: 28

➥ రాజస్థాన్: 125

➥ తమిళనాడు: 56

➥ తెలంగాణ: 70

➥ ఉత్తర్‌ ప్రదేశ్: 44

➥ ఉత్తరాఖండ్: 09

➥ పశ్చిమ్‌ బెంగాల్: 42

అర్హత: పోస్టులకు అనుగుణంగా పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్ (పోస్టుకు అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్-50 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ఇంటెలిజెన్స్-20 ప్రశ్నలు- 20 మార్కులు, అరిథ్‌మెటిక్ ఎబిలిటీ-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

ముఖ్యమైన తేదీలు…

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023.

Notification

Online Application

Website

ALSO READ:

నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link