Fact Check: వాట్సాప్‌లో ఓ ఆడియో క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరులో ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎమ్ బ్యాలెట్ బటన్ పని చేయలేదన్నది ఆ ఆడియో సారాంశం. ఇది నిజమా కాదా అని వెరిఫై చేయకుండానే చాలా మంది వాట్సాప్‌లో అందరికీ ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఇది కాస్తా ఎన్నికల సంఘం దృష్టి వరకూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమై ఫ్యాక్ట్‌చేయగా అదంతా అవాస్తవం అని తేలింది. బెంగళూరులోని శాంతినగర్‌లో బూత్ నంబర్ -17లో ఈవీఎమ్ బ్యాలెట్ బటన్ యాక్టివేట్ కాలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు అధికారులు.
క్లెయిమ్ (ప్రచారం):
ఈ ఆడియో క్లిప్‌లో ఓ వ్యక్తి బెంగళూరులోని శాంతినగర్‌లో పోలింగ్ బూత్ నంబర్ 17లో EVM బ్యాలెట్ బట్ పని చేయాలని చెప్పాడు. అందులో ఇంకా ఏముందంటే..
“నేను ఓటర్ స్లిప్ ఇచ్చి ఓటు వేసేందుకు లోపలికి వెళ్లాను. ఈవీఎమ్‌పై బటన్ నొక్కాను. కానీ ఎలాంటి శబ్దమూ రాలేదు. అటు వీవీప్యాట్‌లోనూ నేను ఓటు వేసిన అభ్యర్థి ఫొటో కనిపించలేదు. ఓ 10-15 సెకన్ల తరవాత మరోసారి బటన్ నొక్కాను. అప్పుడు కూడా వీవీప్యాట్ మెషీన్లో ఎలాంటి సౌండ్ రాలేదు. నాకు చాలా కోపం వచ్చి అక్కడి సిబ్బందిని అడిగాను. సౌండ్ ఎందుకు రావడం లేదని నిలదీశాను. నేను మరీ అంత పిచ్చోడిగా కనిపిస్తున్నానా అని మండిపడ్డాను. కంట్రోల్ ప్యానెల్లో బటన్ నొక్కాల్సిన వ్యక్తి ఆ పని చేయలేదని అర్థమైంది. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఓటు వేసే ముందు కంట్రోల్ ప్యానెల్లో బటన్ నొక్కారా లేదా అని సరి చూసుకోండి. అతను అక్కడ బటన్ నొక్కిన తరవాత EVMపై గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఆ తరవాత మనం బటన్ నొక్కితే ఓటు నమోదవుతుంది. మీరు ఓటు వేసే సమయంలో ఈవీఎమ్‌పై గ్రీన్ లైట్ లేకపోతే అక్కడి సిబ్బందిని నిలదీయండి”
Reports of alleged non-activation of a ballot unit by a polling official in a polling booth in Shantinagar in Bengaluru, circulating on social media & WhatsApp as an audio message are incorrect & baseless. The correct position has been outlined below by DEO, after due enquiry : https://t.co/knZHlh6YZd
— Spokesperson ECI (@SpokespersonECI) April 27, 2024
నిజమేంటి..?
ఈ ఆడియో క్లిప్ నిజమా కాదా అని Newschecker టీమ్ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అలాటిదేదీ జరగలేదని తేల్చి చెప్పినట్టు ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది. బెంగళూరులో ఇలా జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసింది. బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఏప్రిల్ 26వ తేదీన దీనిపై క్లారిటీ ఇస్తూ Xలో ఈ పోస్ట్‌లు షేర్ చేశారు. మొత్తంగా చూస్తే బెంగళూరులో EVM బటన్ యాక్టివ్ కాలేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం కాదని తేలింది.
This story was originally published by newschecker.in, as part of the Shakti Collective. This story has been translated by ABPDesam staff.
మరిన్ని చూడండి