ByGanesh
Sun 31st Mar 2024 09:53 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఆయన అభిమానులు తెగ వెతికేస్తున్నారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి స్విజర్లాండ్ వెళ్లారని తెలుసు. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని తెలుసు. కానీ సూపర్ స్టార్ తప్ప ఆయన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలు మంచుతో ఆటాడుకుంటూ కనబడుతున్నారు. పిల్లలు సందడి చేస్తున్నా మహేష్ కానరావడం లేదు. మహెష్ బాబు ని ఒక్కసారి చూడాలని ఫాన్స్ చాలా ఆత్రంగా ఉన్నారు.
అసలే రాజమౌళి తో సినిమా స్టార్ట్ అయ్యాక మహేష్ మళ్ళీ ఎప్పుడు కనబతారో అని ఆయన అభిమానులు అప్పుడే బెంగ పెట్టుకుంటున్నారు. అక్కడ స్విజర్లాండ్ లో పిల్లలతో కలిసి మహేష్ కనబడితే బావుటుంది అనేది వారి కోరిక. మరి మహేష్ సీక్రెట్ గా ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. ఆయన భార్య పిల్లలు మంచు ముద్దలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో మహేష్ కనిపించకపోవడంతో మహేష్ ఫాన్స్ బెంగ పెట్టుకున్నారు.
ఇక మహేష్ ప్రస్తుతం రాజమౌళితో చెయ్యబోయే SSMB 29 కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఉగాదికి SSMB 29 అప్ డేట్ రావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరి రాజమౌళి-మహేష్ కాంబో SSMB 29 ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని ఆయన అభిమానులే కాదు కామన్ ఆడియెన్ కూడా క్యూరియాసిటీగా ఉన్నారు.
Fans search for superstar:
Mahesh Babu holidaying in Switzerland