Female CEO Sues American Airlines After Crew Ignored Co-Passenger Who Masturbated Next To Her | Viral News: ప్రయాణికురాలు పక్కన ఉండగానే హస్త ప్రయోగం – విమానంలో అరాచకం

Female CEO Sues American Airlines: విమానంలో చిన్న తప్పు చేసినా..  పక్క ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా అసహజంగా ప్రవర్తించినా సరే సీరియస్ గా తీసుకుంటారు. అయితే పక్కన మహిళా ప్రయాణికురాలు ఉండగా ఓ వ్యక్తి సీట్లో కూర్చుని హస్త ప్రయోగం చేసుకున్నాడు. ఇది చాలా అభ్యంతరకరం అని ఆ మహిళా ప్రయాణికురాలు ఎయిర్ లైన్స్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ వాళ్లు పట్టించుకోలేదు. అదంతా కామన్ అన్నట్లుగా వ్యవహరించారు. దాంతో ఆమె ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని అనుకోలేదు. నేరుగా ఆ విమానయాన కంపెనీపై దావా వేసింది. 
 
లగ్జరీ వీగన్ లెదర్ బ్రాండ్ మేలాతో సహా మూడు కంపెనీలకు CEO అయిన 37 ఏళ్ల నీల్ ఎల్షెరిఫ్  అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణిస్తూండగా పక్క సీట్లో ఉన్న  ప్రయాణీకుడు హస్తప్రయోగం బహిరంగంగా చేసుకున్నాడు. ఎయిర్ లైన్స్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ ఘటన  గత సంవత్సరం మే 27న న్యూయార్క్ నుండి మిలన్‌కు ఎల్షెరిఫ్ ప్రయాణిస్తున్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని ఆమె ్నుకోలేదు.  

బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంపై దావా దాఖలు చేశారు.  నిందితుడు  హస్త ప్రయోగం ప్రారంభించడానికి ముందు అనేక గ్లాసుల షాంపైన్ తాగాడని ఎల్షెరిఫ్  లాసూట్ లో పేర్కొన్నారు.  ఎల్షెరిఫ్ ప్రీమియం ఎకానమీలో సీటు బుక్ చేసుకున్నారు.  ఆ వ్యక్తి దాదాపు గంటసేపు క్యాబిన్‌లో  హస్త ప్రయోగం చేయడంతో  భయాందోళనకు గురయ్యానని అరబ్ CEO దావాలో పేర్కొన్నారు. ఎల్షెరిఫ్ వెంటనే విమాన సహాయకుడికి సమాచారం అందించినా ఎవరూ సాయం చేయలేదు. పైగా మరో చోటకు మారమని ఉచిత సలహా ఇచ్చారు.  పురుషులు అలాంటి పనులు చేస్తారని ఎయిర్ హోస్టెస్ తేలికగా తీసుకున్నారు.  



 అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఈ సంఘటనను  పట్టించుకోకపోవడంతో పాటు  హస్త ప్రయోగం చేసుకున్న ప్రయాణికుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకకపోవడంతో ఎల్షెరిఫ్ దావా వేశారు.  అరబ్ కు చెందిన మహిళను అయినందునే  తన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించలేదని  ఇది వివక్షేనని ఆమె ఆరోపించింది.  అమెరికన్ ఎయిర్‌లైన్స్‌పై చట్టపరమైన  నిర్లక్ష్యం  ద్వారా మానసిక క్షోభను కలిగించిందని దావాలో స్పష్టం చేసింది. ఈ దావాపై అమెరికన్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ఆ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చింది.                                     

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link