First look of Raghava Lawrence in Chandramukhi 2 చంద్రముఖి 2 నుంచి రాఘవ లారెన్స్ లుక్


Mon 31st Jul 2023 04:35 PM

chandramukhi 2  చంద్రముఖి 2 నుంచి రాఘవ లారెన్స్ లుక్


First look of Raghava Lawrence in Chandramukhi 2 చంద్రముఖి 2 నుంచి రాఘవ లారెన్స్ లుక్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2. బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు చంద్రముఖి 2 సినిమాను రూపొందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్ర‌త్వం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. లుక్‌లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోన్న అంశం. 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన చంద్ర‌ముఖి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే.  దానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 రానుంది. 

భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న చంద్రముఖి 2 చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


First look of Raghava Lawrence in Chandramukhi 2:

Chandramukhi 2 Worldwide Grand Release On Vinayaka Chavithi





Source link