Fixed title for RC 16 RC 16 కి టైటిల్ ఫిక్స్


Wed 22nd Jan 2025 09:51 PM

ram charan  RC 16 కి టైటిల్ ఫిక్స్


Fixed title for RC 16 RC 16 కి టైటిల్ ఫిక్స్

ఉప్పెన తర్వాత బుచ్చి బాబు ప్లాన్స్ గ్లోబల్ స్టార్స్ తో సినిమా చెయ్యాలనే కల తీరి.. ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యాక.. అది వదిలేసి మరో స్టార్ రామ్ చరణ్ తో RC 16ని మొదలు పెట్టి సెట్స్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికే మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసిన బుచ్చిబాబు రామ్ చరణ్ తో కలిసి ఈనెల 28 నుంచి హైదరాబాద్ బూత్ బంగ్లాలో కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నారు. 

అయితే బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనుకున్న కథ, టైటిల్ తోనే రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడనే టాక్ ఉంది. ఎన్టీఆర్-బుచ్చిబాబు కలయికలో పెద్ది టైటిల్ తో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా ఉండబోతుంది అన్నారు. ఇప్పుడు చరణ్ తో చెయ్యబోయే ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ నే వినిపిస్తుంది. 

కాదు కాదు పెద్ది టైటిల్ RC 16 కి ఆల్మోస్ట్ ఫిక్స్ అంట. ఈ టైటిల్‌ మాస్‌గా, పవర్‌ఫుల్‌గా కూడా ఉండటంతో చిత్ర యూనిట్‌ కూడా ఇదే టైటిల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది. మార్చిలో రామ్‌చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, శివ రాజ్ కుమార్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు. మ్యూజిక్ ఏ ఆర్  అందిస్తున్నారు. 


Fixed title for RC 16:

Ram Charan RC 16 Title Revealed





Source link