PM Modi On Congress : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం (ఫిబ్రవరి 6) రాజ్యసభలో ధన్యవాద తీర్మాన చర్చకు సమాధానం ఇచ్చారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందన్నారు. అందరి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని ప్రశంసిస్తూ, అది దేశ ప్రజల భవిష్యత్‌కు మార్గదర్శకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
మార్గదర్శకంగా రాష్ట్రపతి ప్రసంగం
“భారతదేశ విజయాలు, ప్రపంచం నుంచి ఉన్న అంచనాలు, సాధారణ ప్రజల ఆత్మవిశ్వాసం, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంపై ప్రస్తావించిన రీతిలో రాష్ట్రపతి ప్రసంగం ప్రభావంతంగా, మార్గదర్శిగా ఉంది” అని మోదీ అన్నారు.
సబ్కా సాథ్, సబ్కా వికాస్ కు అర్థం తెలియని కాంగ్రెస్
కాంగ్రెస్‌పై కుటుంబ రాజకీయాలను ఉద్దేశించి మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక్క కుటుంబం కోసం అంకితం అయిపోయింది. అందువల్ల ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ భావన వారికి పనిచేయదు. కాంగ్రెస్ మోసపూరిత, అవినీతి, కుటుంబపారంపర్య రాజకీయాలను నమ్మింది. అందులో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ కి చోటు లేదు” అని మోదీ విమర్శించారు.
Also Read : YS Jagan Latest News: అధికారులతో వైసీపీ కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తా- అసెంబ్లీకి రాకుంటే ఏం చేస్తారో చేసుకోండి- జగన్ సంచలన వ్యాఖ్యలు
‘కుటుంబం ఫస్ట్’ మోడల్ నమ్మే కాంగ్రెస్
కాంగ్రెస్ తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేస్తుందని మోదీ అన్నారు. అందుకే వారి విధానాలు, విధి విధానాలు కూడా కుటుంబాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉంటాయన్నారు. 2014 తర్వాత దేశానికి ఒక ప్రత్యామ్నాయ పాలనా మోడల్ లభించింది. ఇది ప్రీతిపాత్రం రాజకీయాలు కాకుండా ప్రజల సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని మోదీ అన్నారు.
‘దేశం ఫస్ట్’ మాదిరే మేం పనిచేశాం
కుటుంబం ఫస్ట్ అనే మోడల్‌ను కాంగ్రెస్ అనుసరిస్తే, మేము ఎల్లప్పుడూ ‘దేశం ఫస్ట్’ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్ళామని మోదీ అన్నారు. ప్రజలు మమ్మల్ని దేశానికి మూడోసారి సేవ చేసే అవకాశం కల్పించారు. వారు మా పాలనను అంచనా వేసి, మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చామని చూశారని మోదీ వ్యాఖ్యానించారు.
Also Read : Revanth Vs TollyWood: గద్దర్ అవార్డుకు పోటీగా ఫిల్మ్ చాంబర్ అవార్డులు – రేవంత్ పై టాలీవుడ్ తిరుగుబాటేనా ?
బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్
బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చిందని.. కాంగ్రెస్ ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఈ మాత్రం కూడా చేయలేదని మోదీ ఆరోపించారు. “కాంగ్రెస్‌కు అంబేద్కర్‌పై ద్వేషం ఉంది. ఆయనను రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు వారు అన్నీ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రజల ఒత్తిడితో కాంగ్రెస్ నాయకులు ‘జై భీమ్’ నినాదం చేయాల్సి వస్తోంది, కానీ వారు అది హృదయపూర్వకంగా చెబుతున్నట్టు కనిపించదు” అని మోదీ వ్యాఖ్యానించారు.
మరిన్ని చూడండి