Google Introduces AI Search Tool In India Hindi And English Language Know Details

Google AI: 

హిందీ ఇంగ్లీష్‌లలో వాయిస్ సెర్చ్..

గూగుల్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సెర్చ్ టూల్‌కి  Generative Artificial Intelligence ఫీచర్‌ని జోడించింది. దీని ద్వారా ఇండియా, జపాన్‌లోని యూజర్స్‌ తమ భాషల్లోనే వాయిస్ సెర్చ్ చేసేందుకు వీలవుతుంది. ఇండియాలో అయితే హిందీ, ఇంగ్లీష్‌లో వాయిస్ ప్రాంప్ట్స్ ద్వారా సెర్చింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. జపాన్‌లో స్థానిక భాషల్లోనే వాయిస్ సెర్చ్ చేస్తే రిజల్ట్స్ వచ్చేలా ఈ ఫీచర్‌ని డెవలప్ చేసింది. అంతకు ముందు అమెరికాలో ఈ ఫీచర్‌ని లాంఛ్ చేసింది గూగుల్.  ఈ వారంలో ఈ రెండు దేశాల్లోనూ లాంఛ్ చేసింది. ఈ ఫీచర్‌ని ఆప్ట్ చేసుకుంటే సులువుగా వాయిస్ ప్రాంప్ట్స్‌తో సెర్చ్ చేసుకోవచ్చని గూగుల్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ Bingతో పోటీ పడుతున్న గూగుల్…ఇలా కొత్త ఫీచర్‌లతో ముందుకొస్తోంది. సెర్చ్ బార్‌తో పని లేకుండా పైలట్ ప్రాజెక్ట్‌గా ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు నెలల కిందటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో లాంఛ్ చేస్తూ వస్తోంది గూగుల్. ఇప్పుడు ఇండియాలో ప్రారంభించింది. దీనిపై గూగుల్ జనరల్ మేనేజర్ ఎలిజబెత్ రీడ్‌ స్పందించారు. 

“జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో సెర్చ్ ఇంజిన్‌లో చాలా మార్పులు తీసుకొస్తున్నాం. ముందెప్పుడూ ఊహించని విధంగా సెర్చ్ ఇంజిన్‌ని వినియోగించుకునేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది. ముందు కన్నా సులువుగా సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది”

– ఎలిజబెత్ రీడ్, గూగుల్ జనరల్ మేనేజర్ ఆఫ్ సెర్చ్ 

గూగుల్ ఇండియా జనరల్ మేనేజర్ ఆఫ్ సెర్చ్ పునీష్ కుమార్ కూడా ఈ ఫీచర్‌పై స్పందించారు. ఈ ఫీచర్‌ని ఎంచుకునే వారికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గూగుల్ ప్లాట్‌ఫామ్‌ని అన్ని విధాలుగా ఎక్స్‌పాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

“గూగుల్ ప్లాట్‌ఫామ్‌ని వీలైనంత వరకూ ఎక్స్‌పాండ్ చేయాలన్నదే మా లక్ష్యం. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆప్ట్ చేసుకునే వారెవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రైవసీ, యూజర్ డేటా పాలసీల్లో మాత్రం ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ విషయంలో కట్టుబడే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెర్చ్ ఇంజిన్స్‌లో లీడర్‌గా నిలవాలన్నదే మా లక్ష్యం”

– పునీష్ కుమార్, గూగుల్ ఇండియా జనరల్ మేనేజర్ ఆఫ్ సెర్చ్ 

ఫ్లైట్స్ టికెట్స్‌పై కొత్త ఫీచర్..

గూగుల్ ఫ్లైట్స్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే విమానా టికెట్లను పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సైట్లలో ఏదైనా వస్తువు కొనాలనుకుంటే.. వాటి ధర గతంలో ఏ సమయంలో ఎంత ఉంది, ప్రస్తుతమున్న ధర ఎక్కువా తక్కువా అని తెలుసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే గూగుల్ ఫ్లైట్స్ లో కూడా విమాన టికెట్ ధర గతంతో పోలిస్తే తక్కువుందా.. ఎక్కువుందా అనేది తెలుసుకోవచ్చు. అయితే మనం కొన్న తర్వాత దాని ధర తగ్గుతుందా, పెరుగుతుందా అని మాత్రం చెప్పలేని పరిస్థితి. కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్లతో సదరు టికెట్ ధర పెరుగుతుందా, తగ్గుతుందా కూడా తెలుసుకోవచ్చు. విమానం బయలుదేరే తేదీకి నెలల ముందు వాటి ధరలు బాగా తక్కువగా ఉంటాయి. టేకాఫ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ధరలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల తగ్గవచ్చు కూడా. అయితే ఈ ట్రెండ్ ను బట్టి కొత్త ఫీచర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. దీని వల్ల విమాన టికెట్ ఎప్పుడు కొనవచ్చు అనేది ఒక అంచనాకు రావొచ్చు అని గూగుల్ పేర్కొంది.

Also Read: ముంబయిలో విపక్ష కూటమి భేటీకి అంతా రెడీ, హిందుత్వ అజెండాతో సమావేశాలు!

Source link