ByGanesh
Fri 01st Nov 2024 11:07 AM
శ్రీను వైట్ల దర్శకుడిగా గోపీచంద్ హీరోగా గత నెలలో థియేటర్స్ లో విడుదలైన విశ్వం చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాదు క్రిటిక్స్ నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. కొంతమంది మాత్రం శ్రీను వైట్ల కామెడీని ఎంజయ్ చేసారు, దానితో విశ్వం చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వచ్చాయి.
అయితే కొద్దిరోజులుగా విశ్వం చిత్రం ఓటీటీ పై చాలారకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఫ్యాన్సీ డీల్ తో విశ్వం ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలైన మూడు వారాల్లోగా ఓటీటీ కి తెచ్చేస్తారనే ప్రచారం జరిగింది.
అనుకున్నట్టుగానే అక్టోబర్ 11 న థియేటర్స్ లో విడుదలైన విశ్వం చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు ఎలాంటి చప్పుడు, హడావిడి లేకుండా ఈరోజు అంటే నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చెయ్యడంతో గోపీచంద్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవ్వగా.. మిగతా ఓటీటీ ప్రియులు షాకయ్యారు.
మరి విశ్వం సినిమాను థియేటర్స్ లో మిస్ అయ్యినవారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
Gopichand Viswam is now streaming :
Gopichand Viswam is now streaming on Amazon Prime Video