Supreme Court On Govt Job Recruitment Process: పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కానీ ప్రక్రియ పూర్తైన తర్వాత కానీ రూల్స్ మార్చలేరని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. పబ్లిక్ రిక్రూట్మెంట్ పారదర్శకత, వివక్షరహితంగా ఉండాలి స్పష్టం చేసింది.
రూల్స్ అనుమతిస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిబంధనలు మధ్యలో మార్చలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి సంబంధించిన రూల్స్‌ను ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన తర్వాత సంబంధిత అధికారులు మార్చగలరా అనే వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
కె మంజుశ్రీ అండ్ అదర్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య 2008 నడిచిన కేసులో వచ్చిన తీర్పును సమర్థించింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిబంధనలను మధ్యలోనే మార్చలేరని తేల్చిచెప్పిన గత తీర్పు మంచిదేనని స్పష్టం చేసింది. కే మంజుశ్రీ తీర్పు మంచి చట్టమని దాన్ని తప్పుపట్టలేమని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ నోటిఫికేషన్‌తో ప్రారంభమవుతుదని… అర్హత నిబంధనలు మధ్యలో మార్చడానికి వీలు పడదని తెలిపింది.
ఉద్యోగ రిక్రూట్మెంట్స్ కూడా ఆర్టికల్స్ 14 (సమానత్వ హక్కు), 16 (ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షత లేనివి) ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన పవర్ కలిగి ఉన్న ప్రస్తుత రూల్స్ ఏకపక్షంగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
Also Read: లీవ్ లెటర్ ఇలా కూడా రాస్తారా? – ఉద్యోగి బాస్‌కు పంపిన మెయిల్ వైరల్
మరిన్ని చూడండి