Gyanvapi Mosque Case:
సుప్రీంకోర్టులో పిటిషన్
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తీర్పుకి వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది. మసీదులో సర్వేని అడ్డుకోవాలని మసీద్ కమిటీ తరపున న్యాయవాది కోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం “పరిశీలిస్తాం” అని సమాధానమిచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఈమెయిల్ కూడా పంపినట్టు మసీద్ కమిటీ తరపున అడ్వకేట్ నిజాం పాషా వెల్లడించారు. ఇటు హిందువుల వైపు నుంచి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని పిటిషనర్ రాఖీ సింగ్ కోర్టుని కోరారు. ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు.
The Anjuman Intezamia Masjid Committee moves Supreme Court challenging the Allahabad High Court order allowing ASI to conduct a scientific survey by ASI of the Gyanvapi mosque premises.
Advocate of the Masjid Committee mentions the matter before Supreme Court saying not to allow… pic.twitter.com/R6GgpLGVY4
— ANI (@ANI) August 3, 2023
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. ASI సర్వే చేయొచ్చని తీర్పునిచ్చింది. ఈ సర్వే చేయడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ని తోసిపుచ్చిన న్యాయస్థానం…సర్వేకి అనుమతినిచ్చింది. నిజానికి జులై 21వ తేదీనే ASI సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అది మసీదా లేకపోతే ఆలయమా తేలాలంటే ఈ సర్వే చేయాల్సిందేనని ఓ మహిళ వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది. జులై 24న సర్వే మొదలైనా…మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కారణంగా స్టే విధించాల్సి వచ్చింది. ఈ సర్వే కారణంగా మసీదు నిర్మాణం పాక్షికంగా దెబ్బ తింటుందని, అక్కడ తవ్వడం వల్ల కూలిపోయే ప్రమాదమూ ఉందని వాదించింది మసీదు కమిటీ. అయినా ఇలాంటి ప్రాంతాల్లో సర్వే చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది Anjuman Intezamia Masjid Committee. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం…అంతకు ముందు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. న్యాయం జరగాలంటే కచ్చితంగా ఈ సర్వే జరపాల్సిందే అని స్ఫష్టం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన యూపీ డిప్యుటీ సీఎం కేశవ్ ప్రసాద్… ఈ తీర్పుతో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ సర్వేని రేపటి నుంచే (ఆగస్టు 4) మొదలు పెట్టనున్నారు.