Haryana Clashes US State Department Calls For Peace, Urges Parties To Refrain From Violence

Haryana Clashes: 

స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పందన..

హరియాణాలోని అల్లర్లపై అగ్రరాజ్యం స్పందించింది. అంతా శాంతియుతంగా ఉండాలని సూచించింది. హింసకు పాల్పడొద్దని తెలిపింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ నూహ్ అల్లర్లపై ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఘర్షణలో అమెరికా పౌరులెవరైనా గాయపడ్డారా అన్న సమాచారం లేదని, ఎంబసీని సంప్రదించిన తరవాతే ఈ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు మిల్లర్. 

“హరియాణాలోని నూహ్‌లో పరిస్థితులను చూస్తున్నాం. కారణమేదైనా సరే ఇరు వర్గాలు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హింసకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ఈ హింసకు కారణమేంటన్నది తెలియదు. ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నాం”

– మాథ్యూ మిల్లర్, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి

 

Source link