పీహెచ్ డీ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సబ్జెక్టులతో పాటు ఖాళీల వివరాలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అక్టోబరు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.