He Gave Lift To 11 Men Then Killed Them Know Case Details | Serial Killer : 18 నెలల్లో 11మంది హత్య

Serial Killer : 18 నెలల్లోనే 11మందిని హత్య చేసిన ఓ హోమోసెక్సువల్ సీరియల్ కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ కిల్లర్ వారందర్నీ ఎలా ఎందుకు హత్య చేశాడో తెలుసుకుని అవాక్కయ్యారు. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతోన్న ఈ నిందితుడు.. పురుషుల్నే ఎందుకు హత్యలు చేశాడు, అసలు ఎలా వారిని చంపాడు అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లో 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన 33ఏళ్ల సీరియల్ కిల్లర్ పేరు రామ్ సరూప్‌. హోషియార్‌పూర్‌లోని గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన ఆయనకు భార్యా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అతడో హోమోసెక్సువల్. ఈ విషయం తెలుసుకున్న కిల్లర్ భార్య రెండేళ్ల క్రితమే తన పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో అప్పట్నుంచి ఒంటరిగా ఉంటూ.. పురుషులతో లైంగిక సంబంధాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్న రామ్ సరూప్.. అడిగినంత డబ్బు వాళ్లు ఇవ్వకపోయినా, గొడవ చేసినా.. తన దగ్గర ఉన్న ఓ గుడ్డతో వారి ప్రాణాలు తీసేవాడు. అది దొరకని పక్షంలో పక్కనే ఉన్న బండరాల్లు, ఇటుకలు వంటి వాటితో తలపై బాది చంపేవాడు. ఆపై తనకు ఏం తెలియదన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 11 మంది పురుషులను హత్య చేశాడు. 

Also Read : Donald Trump: నా ప్రభుత్వంలో వారికి మరణశిక్ష తప్పదు – బైడెన్ ను తప్పుబట్టిన డొనాల్డ్ ట్రంప్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులందరూ పురుషులే. వారితో అతను లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఇటీవల ఓ హత్య చేసి పోలీసులకు చిక్కాడు. ఆగస్టు 18న టోల్‌ప్లాజా మోడ్రా వద్ద టీ అందించే 37 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని ప్రాథమికంగా అరెస్టు చేశారు. విచారణలో సరూప్ మరో 10 మందిని హత్య చేసినట్లు వెల్లడించాడు. వీటిలో ఇప్పటి వరకు ఐదు కేసులు నిర్ధారణ కాగా, మిగిలిన హత్యల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఈ సీరియల్ కిల్లర్ కథ మొత్తం బట్టబయలైంది. ప్రస్తుతం పోలీసులు బాధితుల మృతదేహాలను వెతికే పనిలో పడ్డారు. 

నిందితుడు సెక్యూరిటీ గార్డు

ఒక హత్యలో, నిందితుడు బాధితురాలి వీపుపై ‘ధోకేబాజ్’ (మోసగాడు) అని రాశాడు. అతను ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుడు. కూలీ పనులు చేసుకునే ఈ నిందితుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు అధికారులు తెలిపారు.

సీరియల్ కిల్లర్ చెప్పిన ప్రకారం, వారిని చంపిన తర్వాత అతను పశ్చాత్తాపంతో బాధితుడి పాదాలను తాకి క్షమించమని అడిగేవాడు. మద్యం మత్తులో ఉన్నప్పుడే ఈ నేరాలకు పాల్పడుతున్నానని.. ఆ తర్వాత అవి గుర్తుండవి చెప్పాడు. ఈ కేసుల ోనిందితుడిని అరెస్టు చేశామని, త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Also Read : Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు

మరిన్ని చూడండి

Source link