ByGanesh
Wed 11th Dec 2024 12:56 PM
మంచు మోహన్‌బాబు మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటెల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి ఆయనకు వైద్యులు ఐసియు లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా కాంటినెంటెల్ ఆస్పత్రి బృందం ఒక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని పేర్కొంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించింది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు గుర్తించినట్లుగా ప్రకటించారు.
Health bulletin on Mohan Babu health:
Mohan Babu health update