ByKranthi
Wed 02nd Aug 2023 02:12 PM
టాలీవుడ్‌లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్.. ఆ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్‌తో అనేక సినిమాలు చేశారు. అయితే తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా తరుణ్‌కి పెళ్లి కాకపోవడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందనేలా వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక అమ్మాయితో లింక్ చేస్తూ.. సోషల్ మీడియాలో తరుణ్ పెళ్లి వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడొస్తున్న పెళ్లి వార్తలపై తరుణ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు. దీంతో ఇప్పుడొస్తున్న వార్తలో నిజం లేదనే క్లారిటీ వచ్చేసింది.
అసలు వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే.. తరుణ్ మెగా ఫ్యామిలీలోకి అల్లుడిగా అడుగు పెట్టబోతున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక, లేదంటే శ్రీజ అన్నట్లుగా కొందరు కావాలని రూమర్స్ వ్యాప్తి చేయడంతో.. ఈ వార్తలపై తరుణ్ ఇలా క్లారిటీ ఇచ్చారు.
Hero Tarun Clarity on Marriage Rumours:
Tarun About His Marriage