Heroes suffering with heroines హీరోయిన్స్ తో సఫర్ అవుతున్న హీరోలు


Thu 31st Aug 2023 04:05 PM

vijay devarakonda  హీరోయిన్స్ తో సఫర్ అవుతున్న హీరోలు


Heroes suffering with heroines హీరోయిన్స్ తో సఫర్ అవుతున్న హీరోలు

సీనియర్ హీరోయిన్స్ తో సినిమాలు చేసిన యంగ్ హీరోలు ఇద్దరు ఎంతగా సఫర్ అవుతున్నారో చూస్తున్నాము. సమంత, అనుష్క ఈ ఇద్దరితో సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ-నవీన్ పోలిశెట్టి లు సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో ఆ హీరోయిన్స్ వలన ఈ ఇద్దరూ సినిమా భారాన్ని మోస్తున్నారు. సమంత అనారోగ్యంతో ఖుషి షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. అనుష్క వలన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి విడుదల అనేకసార్లు వాయిదా పడింది. 

ఇక ఎట్టకేలకి విడుదలకి రెడీ అయ్యాక సమంత ఖుషి ప్రమోషన్స్ ని హెల్త్ రీజన్స్ చెప్పి లైట్ తీసుకుంది. రెండు మూడు ప్రమోషనల్ ఈవెంట్స్ తో మమ అనిపించెయ్యగా.. విజయ్ దేవరకొండ సోలోగా ఏదో చక్కబెట్టేసాడు. సమంత లేకుండా విజయ్ సోలోగా కనిపిస్తే ఎవరు చూస్తారు. 

మరోపక్క నవీన్ పోలిశెట్టి పరిస్థితి చెప్పనలవి కాదు, అనుష్క పబ్లిక్ లోకి రాదు. సినిమా పూర్తవ్వడానికే బోలెడంత సమయం తీసుకుంటుంది. మరో వారంలో విడుదల కాబోయే మిస్ శెట్టి కోసం అనుష్క ఏ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనదు. ఏదో ఇంటర్వ్యూ తో సరిపెట్టేస్తుంది. అనుష్క బరువు నవీన్ కి చుక్కలు చూపిస్తుంది. అటు సమంత హెల్త్ రీజన్స్, ఇటు అనుష్క బరువుతో విజయ్-నవీన్ ఇద్దరూ ఎంతగా సఫర్ అయ్యారో పాపం. 


Heroes suffering with heroines:

Vijay Devarakonda – Naveen Polishetty and Samantha – Anushka





Source link