ByKranthi
Sat 01st Jul 2023 08:28 PM
అందం ఎలా ఉన్నా ఆకర్షణగా, నటనలో ది బెస్ట్ అనిపించుకుని జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుని ఇప్పటికీ ప్రత్యేకమైన పాత్రలతో అలరిస్తున్న నటి ప్రియమణి. తాజాగా ఈ భామ ఈ మధ్యన తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌పై మాట్లాడింది. ముస్లిం మతస్తుడైన ముస్తఫాని వివాహం చేసుకోవడంపై దారుణంగా మాట్లాడారు. నేను నా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాను. నా జీవితానికి ఏది మంచిదో అదే చేశాను.. ఆ ట్రోల్స్‌ని పట్టించుకోను అని చెప్పింది. ఇంకా ఆమె మాటలు వైరల్ అవుతుండగానే.. తాజాగా బోల్డ్ సీన్స్‌లో తాను నటించకపోవడానికి గల కారణాలను ప్రియమణి రివీల్ చేసింది.
కొద్దిరోజులుగా ప్రత్యేకమైన పాత్రలకి కేరాఫ్‌గా మారిన ప్రియమణి ప్రస్తుతం జవాన్ చిత్రంలో చేస్తుంది. రీసెంట్గా కస్టడీ చిత్రంలో నటించినా దాని రిజల్ట్ ప్రియమణిని నిరాశపరిచింది. అయితే తాజాగా తాను కొన్ని సీన్స్‌లో నటించకపోవటానికి కారణం ఉంది. నేను ఆ రకమైన సీన్స్ చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేను ఇలాంటి కేరెక్టర్స్ చేయడం కరెక్ట్ కాదు. నేను అలాంటి పాత్రలు చేస్తే వ్యక్తిగతంగా ఇబ్బంది పడతాను, నేను పెళ్లయిన మహిళని, సో అలాంటి కేరెక్టర్స్ చేస్తే నేను నా భర్తకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఆ సీన్స్ ఒప్పుకుని చేస్తే నేను ఇప్పుడు టాప్‌లోనే కాదు చాలా డబ్బు కూడా సంపాదించేదాన్ని. గతంలో నాకు ఇలాంటి కేరెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను వాటిని ఒప్పుకోలేదు. కారణం పైన చెప్పిందే అంటూ ప్రియమణి ఆన్ స్క్రీన్‌లో ప్రత్యేకమైన సీన్స్ చేయకపోవడానికి కారణాలు చెప్పుకొచ్చింది.
Heroine Priyamani Talks about Bold Scenes:
Priyamani opens on kissing scenes