Most Gold Reserves Countries: దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి బంగారం బలమైన సాధనం. పసిడి ఒక విలువైన లోహం మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యానికి మూల స్తంబం. ఆర్థిక స్థిరత్వాన్ని తెలియజేస్తోంది. 1800లు, 1900లలో బంగారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించేది. అప్పటి వరకు అనేక దేశాలు తమ కరెన్సీ ముద్రించే వాళ్లు కాదు. అందుకే దేశాల మధ్య క్రయవిక్రయాలకు బంగారమే మధ్యవర్తిగా ఉండేది.
19వ శతాబ్దం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ దేశాలు తమ కరెన్సీని బంగారం విలువకు అనుగుణంగా నిర్ణయించడం మొదలు పెట్టారు. దీనిని గోల్డ్ స్టాండర్ అని పిలుస్తారు. దీని ప్రకారం జారీ చేసిన ప్రతి కరెన్సీ యూనిట్ బంగారంలో స్థిర విలువ కలిగి ఉంటుంది. ఈ డబ్బులను ప్రజలు గోల్డ్‌గా కూడా మార్చుకోగలరు. అందువలన ఒక దేశం ఆర్థిక స్థిరత్వానికి, దాని కరెన్సీ బలానికి బంగారం ప్రధాన ఆధారం చెబుతారు.
ఆధునిక కాలంలో బంగారం ప్రాముఖ్యత
1970ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ప్రత్యక్ష సంబంధాన్ని పెంచుకుంటూ వస్తోంది. రేటు పెరుగుతున్నప్పటికీ ప్రాముఖ్యత తగ్గలేదు. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారాన్ని సురక్షితమైన, స్థిరమైన సంపదగా చూస్తున్నారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు, బంగారు నిల్వలు కాపాడే ప్రయత్నం చేస్తాయి. వాటి ఆధారంగానే ప్రపంచ దేశాలు ఆ దేశంపై విశ్వసనీయత కలిగి ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు మద్దతు ఇస్తాయి.
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన 20 దేశాలు.
Q2 2024 నివేదిక ఆధారంగా అత్యధిక బంగారు నిల్వలు కలిగిన 20 దేశాల గురించి ఇక్కడ చూద్దాం.
- అమెరికా: 8,133.46 టన్నులు
- జర్మనీ: 3,351.53 టన్నులు
- ఇటలీ: 2,451.84 టన్నులు
- ఫ్రాన్స్: 2,436.97 టన్నులు
- రష్యా: 2,335.85 టన్నులు
- చైనా: 2,264.32 టన్నులు
- జపాన్: 845.97 టన్నులు
- భారతదేశం: 840.76 టన్నులు
- నెదర్లాండ్స్: 612.45 టన్నులు
- టర్కీ: 584.93 టన్నులు
- పోర్చుగల్: 382.66 టన్నులు
- పోలాండ్: 377.37 టన్నులు
- ఉజ్బెకిస్తాన్: 365.15 టన్నులు
- యునైటెడ్ కింగ్‌డమ్: 310.29 టన్నులు
- కజకిస్తాన్: 298.8 టన్నులు
- స్పెయిన్: 281.58 టన్నులు
- ఆస్ట్రియా: 279.99 టన్నులు
- థాయిలాండ్: 234.52 టన్నులు
- సింగపూర్: 228.86 టన్నులు
- బెల్జియం: 227.4 టన్నులు
ప్రపంచంలో ఎంత బంగారం అందుబాటులో ఉంది?
ఇప్పటివరకు ప్రపంచంలో దాదాపు 244,000 మెట్రిక్ టన్నుల బంగారం కనుగొన్నారు. ఇందులో 187,000 మెట్రిక్ టన్నుల బంగారం వెలికితీశారు. 57,000 మెట్రిక్ టన్నుల బంగారం ఇప్పటికీ భూగర్భంలోనే ఉంది. చైనా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఎక్కువ పసిడి గనులు ఉన్నాయి. 2016లో బంగారం ఉత్పత్తిలో యునైటెడ్ స్టేట్స్ నాల్గో స్థానంలో నిలిచింది.
బంగారాన్ని ఉపయోగించడానిక, నిల్వ చేయడానికి కారణాలు
దేశాలు వివిధ కారణాల వల్ల బంగారు నిల్వలను కలిగి ఉంటాయి, వాటిలో ప్రధానమైనవి:
ఆర్థిక స్థిరత్వం: బంగారం అనేది స్థిరమైన, నమ్మదగిన ఆదాయం. ఇది ఆర్థిక సంక్షోభాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సహాయపడుతుంది.
కరెన్సీ మద్దతు: బంగారం ఒక దేశ కరెన్సీ బలాన్ని, దాని ద్రవ్య స్థిరత్వాన్ని చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
విశ్వసనీయత: ప్రపంచ అనిశ్చితుల సమయంలో ఇతర దేశాలతో వాణిజ్యం, రుణ లావాదేవీలు చేయాలంటే బంగారు నిల్వల ఆధారంగా సాగుతాయి.
బంగారు నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి చిహ్నం.
బంగారు నిల్వలు విలువైన మెటల్ సమాహారం మాత్రమే కాదు, అది ఒక దేశ ఆర్థిక స్థిరత్వం, భద్రతకు చిహ్నం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో, బంగారం అత్యంత ముఖ్యమైన వనరుగా చెబుతారు. ఇది దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల, బంగారు నిల్వలు ఇప్పటికీ ప్రపంచ దేశాల ఖజానాలో ముఖ్యమైన భాగంగా చెప్పుకుంటారు.
మరిన్ని చూడండి