Trump gold card visa: అమెరికాలో జీవనం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ పౌరసత్వం కూడా తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ పౌరసత్వం వెంటనే వచ్చేందుకు ఉన్న దారి అక్కడ పెట్టుబడి పెట్టడం. EB 5 అనే విధానం అమల్లో ఉండేది. EB-5 వీసా ప్రోగ్రాం కింద కనీసం 8 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలను అమెరికన్లకు ఇవ్వాలన్న నిబంధన ఉండేది. అంటే నేరుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి పని లేదు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. గ్రీన్ కార్డు లాంటి పౌరసత్వం వచ్చేస్తుంది.
ఇప్పుడు EB-5 వీసా విధానాన్ని ఎత్తేస్తున్న ట్రంప్ గోల్డ్ కార్డ్ ను ప్రవేశ పెడుతున్నట్లుగా ప్రకటించారు. ఇంకా విదివిధానాలు ప్రకటించలేదు. కానీ ఐదు లక్షల డాలర్లు చెల్లిస్తే గ్రీన్ కార్డు తరహా పౌరసత్వం వస్తుందని హింట్ ఇస్తున్నారు. ఈ గోల్డ్ కార్డ్ వల్ల పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు అమెరికా వైపు ఆకర్షితులు కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈబీ-5 వీసా విధానం స్థానంలో గోల్డ్ కార్డ్ విధానాన్ని ప్రవేశ పెడతామని ప్రకటించారు.
ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకు మేలు జరుగుతుందా లేదా అన్నదానిపై అనేక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ అమెరికాకు అత్యంత ప్రతిభావంతులు వచ్చేవారు. వారిని నియంత్రించి.. డబ్బులు ఇచ్చే వారిని అమెరికాకు తీసుకు రావడం వల్ల ఎంత లాభం ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండదు.ఒక వేళ పెట్టుబడులు పెట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న విధానమే అయితే.. EB-5 విధానం బెటర్ గానే ఉంటుంది. కనీసం రూ. 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డు వస్తుంది. పది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు గోల్డ్ కార్డ్ కూడా అలాంటిదే అయితే పేరు మారుస్తున్నట్లుగా చెబితే సరిపోయేది .. కానీ మొత్తం స్కీమ్ మారుస్తున్నారు.
అమెరికా పేరును ఉపయోగించుకుని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిద్దామన్న పద్దతిలో ట్రంప్ ఉన్నారు. ఉద్యోగుల్ని తొలగించడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ సైజును బక్కచిక్కిపోయేలా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు అందే సేవలు తగ్గిపోనున్నాయి. మరో వైపు పన్నుల వ్యవహారంతో అమెరికా ప్రజలపైనా భారం పడుతోంది. అయితే ట్రంప్ మాత్రం ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోందని అంటున్నారు. గోల్డ్ కార్డు వల్ల ఇతర దేశాల్లో సంపన్నులు.. అక్రమార్జనకు పాల్పడిన వారు.. నేరాల్లో ఉన్న వారు అమెరికాలో ఆశ్రయం పొందడానికి ఓ మార్గంగా మారుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే రెండు వారాల్లో గోల్డ్ కార్డు విధి విధానాలను ప్రకటించిన తర్వాత ట్రంప్ అమెరికాను ఏ దిశగా తీసుకెళ్తున్నారో స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.
Also Read: మనుషులే ఉండని చైనాలోని న్యూయార్క్ కన్నా అతి పెద్ద సిటీ – దెయ్యాల నగరంగా ఎందుకు మారిందంటే ?
మరిన్ని చూడండి