Hyderabad CP Kothakota Srinivas Reddy Orders: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ లో హోంగార్డు నుంచి మొదలు…పైఅధికారుల వరకు సిబ్బందిని పూర్తిగా బదిలీ చేశారు. ఇందులో ఎస్ఐలు, ఏఎస్ఐలు, పీసీలతో పాటు హోంగార్డులు ఉన్నారు. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేసేందుకు కొత్తవారిని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.