ByGanesh
Thu 26th Dec 2024 11:22 AM
నాగ చైతన్య-శోభితలు ఎప్పుడు, ఎక్కడ ఎలా పరిచయమై ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లివరకు దారి తీసిందో అనేది శోభిత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2018 లోనే నాగార్జున గారు పిలిస్తే వారింటికి వెళ్ళాను, 2022 లో నాకు చైతు పరిచయమయ్యాడు, నేను ముంబైలో ఉంటే నా కోసం చైతు ముంబై టు హైదరాబాద్ తిరిగేవాడు, ఆతర్వాత అమెజాన్ ఈవెంట్ లో కలిసాక మరింత దగ్గరయ్యాం అంటూ చెప్పింది.
ఇక నాగార్జున కూడా శోభిత తనకు చైతు తో పరిచయం కాక ముందు నుంచే తెలుసు అంటూ రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. శోభిత అందమైన అమ్మాయే కాదు, ఏంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. ఆమె నటించిన సినిమాలు చూస్తే అది అర్ధమవుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది.
చైతు-శోభిత ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళను అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చైతు లైఫ్ లోకి శోభిత రావడంతో నేనేంతో ఆనందంగా ఉన్నాను, శోభితకు అందమే కాదు అంతకుమించిన మంచితనం ఉంది, ఆమె చైతు లైఫ్ లోకి రాకముందే నాకు పరిచయముంది అంటూ నాగార్జున తన కొత్త కోడలు శోభితపై ప్రసంశలు కురిపించారు
I know Shobhita before Chaitu-Nagarjuna:
Nagarjuna on Sobhita Dhulipala