I think the biggest hit in career.. మీనాక్షి కి మొదటి బిగ్గెస్ట్ హిట్


Mon 04th Nov 2024 11:12 AM

lucky bhaskar  మీనాక్షి కి మొదటి బిగ్గెస్ట్ హిట్


I think the biggest hit in career.. మీనాక్షి కి మొదటి బిగ్గెస్ట్ హిట్

హిట్ 2 తో హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి ఖిలాడీతో బిగ్గెస్ట్ డిసాస్టర్ ను చవి చూసింది. గుంటూరు కారం ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసిన మీనాక్షి చౌదరికి కి త్రివిక్రమ్ షాకిచ్చారు. ఆయన మీనాక్షి చౌదరిని మరీ కూరలో కరివేపాకు మాదిరి తీసిపారేసారు. మరోపక్క కోలీవుడ్ స్టార్ విజయ్ తో  జోడి కట్టింది. కోలీవుడ్ కూడా మీనాక్షికి పెద్ద షాకే ఇచ్చింది.

ఇక తెలుగులో మీనాక్షి చౌదిరి కి యంగ్ హీరోల అవకాశాలొచ్చాయి. అందులో మొదటిది లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ దీపావళి సందర్భంగా విడుదలవగా సినిమాకి అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రావడంతో కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి.

ఓపెనింగ్ పరంగా లక్కీ భాస్కర్ మంచి కలెక్షన్స్ సాధించింది. మరోపక్క ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్రకు మంచి పేరొచ్చింది. మీనాక్షి కేరెక్టర్, ఆమె లుక్స్, యాక్టింగ్ ఇలా ప్రతి విషయంలోనూ మీనాక్షిని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. లక్కీ భాస్కర్ హిట్ అవడమే కాదు అందులోను మీనాక్షి కి పేరు రావడం ఆమెకు కలిసొచ్చేలా ఉంది.

మీనాక్షి కెరీర్ లోనే లక్కీ భాస్కర్ మీనాక్షికి బిగ్గెస్ట్ హిట్ అనుకుంటా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో వారంలో మీనాక్షి నటించిన మట్కా విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఈ నెలలోనే విశ్వక్ సేన్ తో నటించిన మెకానిక్ రాఖీ కూడా రిలీజ్ కాబోతుంది. మరి దుల్కర్ హిట్ ఇచ్చారు. వరుణ్, విశ్వక్ మీనాక్షి కి ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. 


I think the biggest hit in career..:

Lucky Bhaskar was Meenakshi Chaudhary first biggest hit





Source link