IBPS Clerks Final Result: దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ మెయిన్స్ ఫలితాలను ఐబీపీఎస్ ఏప్రిల్ 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో తుది ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
IBPS క్లర్క్ తుది ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే ‘Recent CRP Updates’ సెక్షన్‌లో కనిపించే ‘Result for Online Main Examination For CRP-Clerks-XIII’ లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4: వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి.
Step 5: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల తుది ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Step 6: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
IBPS Clerks – Declaration of Result for Online Main Examination
Notification Provisional Allotment under CRP-Clerks-XIII
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.
ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) గతేడాది జులై 1న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. అభ్యర్థుల నుంచి జులై 1 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఫలితాలను సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి సెప్టెంబరు 26న మెయిన్ పరీక్ష అడ్మిట్‌కార్డులను విడుదల చేసి అక్టోబరు 7న మెయిన్ పరీక్ష నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫలితాలను తాజాగా ఐబీపీఎస్ విడుదల చేసింది.
ALSO READ:
IBPS: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల (CRP – PO/MT -XIII) భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి తుది ఫలితాలు చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఫలితాలను ఐబీపీఎస్ విడుదల చేసింది.
ఐబీపీఎస్ పీవో తుది ఎంపిక ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని చూడండి