India Rice Ban Sent People Into A Panic Heres Whats Going On Now

India Rice Ban: గత నెలలో, భారత ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధింది. దీంతో, ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్‌ ఉలిక్కిపడ్డాయి. చాలా దేశాల్లో రైస్‌ సప్లైలో గందరగోళం ఏర్పడింది. USలో, ఐఫోన్ల కోసం క్యూ కట్టినట్లు బియ్యం కోసం డిపార్ట్‌మెంటల్‌ స్టోర్ల ముందు బారులు తీరారు.

అయితే.. జనం భయపడాల్సిన పని లేదని, యూఎస్‌లో రైస్‌కు కొదవలేదని USA రైస్ ఫెడరేషన్ ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్‌లో వినియోగిస్తున్న బియ్యంలో చాలా భాగం దేశంలోనే పండుతోందని, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన దిగుబడి కూడా వచ్చిందని నచ్చజెప్పింది. 

USA రైస్ ఫెడరేషన్ ఎన్ని విధాలా సర్దిచెప్పినా, అగ్రరాజ్యంలో ఆందోళన కనిపిస్తూనే ఉంది. భారత్‌ విధించిన నిషేధంతో యునైటెడ్ స్టేట్స్‌ సహా, భారతీయ బియ్యంపై ఆధారపడే దేశాలపై మీద బాగానే ఎఫెక్ట్‌ పడింది.

తెల్ల బియ్యంపై నిషేధంతో తెల్లబోయిన ప్రపంచ దేశాలు
దేశం నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయకుండా ఈ ఏడాది జులై 20న భారత ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్‌ బ్యాన్‌ ప్రకటించింది. అది తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇండియాలో పెరుగుతున్న రైస్‌ రేట్లకు కళ్లెం వేయడానికి, లోకల్‌గా సప్లై పెంచడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ డెసిషన్‌ తీసుకుంది.

అయితే, బాయిల్డ్‌ రైస్‌, బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు.

ప్రపంచ మార్కెట్‌లోకి భారత్‌ వివిధ రకాల బియ్యాల్ని ఎగుమతి చేస్తోంది. మొత్తం గ్లోబల్‌ బిజినెస్‌లో 40% వాటా మన దేశానిదే. భారత్‌ బ్యాన్‌ చేసిన బియ్యం రకాల వాటా 15%. ఆగ్నేయాసియాలోని ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా, ఐవరీ కోస్ట్, సెనెగల్‌ భారతదేశ బియ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 

ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవలే ఒక బ్లాగ్ పోస్ట్ చేసింది. “నిషేధంతో ప్రపంచ బియ్యం మార్కెట్‌కు తాజా దెబ్బ” అని దానికి టైటిల్‌ పెట్టింది. గత సంవత్సరం పాకిస్తాన్‌లో భారీ వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి కూడా రైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తగ్గాయి, గ్లోబల్‌గా రేట్లు పెరిగాయి. ఇప్పుడు, ఇండియా డెసిషన్‌తో పాటు ఎల్ నినో వాతావరణ పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. ఇండియా నుంచి వచ్చే రైస్‌ తగ్గడం వల్ల గ్లోబల్‌గా రేట్లు పెరుగుతాయని, ఆహార అభద్రత పెరుగుతుందని ఆ పోస్ట్‌లో రాసింది.

భారత్‌లో సప్లై పెరిగితే, ఎగుమతులపై నిషేధాన్ని భారత్‌ ఎత్తివేస్తుందని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భావిస్తోంది. ఇండియా తీసుకున్న నిర్ణయం తాత్కాలికమని, ఎక్కువ కాలం ఉండదని ఆశిస్తోంది.

US మీద ప్రభావం
బియ్యం విషయంలో యునైటెడ్ స్టేట్స్ మంచి పొజిషన్‌లో ఉంది. కాలిఫోర్నియాలో పూర్తి సంవత్సరానికి సరిపడినంత నీరు అందుబాటులో ఉంది. ఇండియా విధించిన నిషేధం వల్ల US బియ్యం దిగుమతుల్లో కేవలం 2.5% ప్రభావితం అవుతుందని అక్కడి ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేశారు. 

యునైటెడ్ స్టేట్స్, ప్రధానంగా స్పెషాలిటీ రైస్‌, అర్బోరియో, జాస్మిన్ రైస్, బాస్మతి వంటి సువాసనలు వెదజల్లే రకాలను దిగుమతి చేసుకుంటోంది. వీటి మీద మాత్రమే ఎఫెక్ట్‌ పడుతోంది. USలో వాడే బియ్యంలో 70-80% సప్లై దేశీయ పంటల నుంచే ఉంటోంది. కాబట్టి, యునైటెడ్ స్టేట్స్‌లో వినియోగించే బియ్యంలో అతి కొద్ది భాగం మాత్రమే నిషేధం వల్ల ప్రభావితమవుతుంది.

అయితే, సోనామసూరి వంటి బాస్మతీయేతర బియ్యంపైనే ఆధారపడుతున్న స్టోర్లు, రెస్టారెంట్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నాయి. బాస్మతీయేతర బియ్యానికి ప్రత్యామ్నాయంగా, బాయిల్డ్‌ రైస్‌తో ఏ ఫుడ్‌ ఐటెమ్స్‌ చేయవచ్చో రీసెర్చ్‌ చేస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: 

Source link