India will gain or lose with the victory of Donald Trump as the President of the United States

Donald Trump For India:  అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఇండియాలో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అయితే ట్రంప్ వల్ల ఇండియాకు లాభమా నష్టమా అన్నదానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార , వాణిజ్య పరంగా ట్రంప్ ఎలాంటి విధానాలు అవలంభిస్తారో అని ఆయా వర్గాలు.. ఇమ్మిగ్రేషన్ పరంగా ఎంత ఇబ్బంది పడతారోనని వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. తాను గెలిస్తే  ఇమ్మిగ్రేషన్ రూల్స్, ట్రేడ్ రెగ్యులేషన్స్, మార్కెట్ ప్రాధాన్యాలను మార్చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్‌పై కఠినమైన వైఖరికి పేరుగాంచిన ట్రంప్ పరిపాలన H-1B వీసాలపై మరిన్ని పరిమితులను ప్రవేశపెడితే భారతీయులు ఎక్కువగా నష్టపోతారు.  
 
వీసాలు కష్టమే !

ట్రంప్ మొదటి టర్మ్ లో  H-1B వీసా దుర్వినియోగాలను అరికట్టడానికి ప్రయత్నించారు. తన పరిపాలన కాలంలో H-1B తిరస్కరణ ,   H-1B/L-1 వీసా ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.   చదువుకునేందుకు అమెరికా వెళ్తున్న వారికి అక్కడ ఉద్యోగం లభిస్తే హెచ్‌1బీ వీసా వస్తుంది.  కెరీర్ మొత్తం వెంటపడుతూనే ఉంటుంది. ఇక్కడ పుట్టిన భారతీయులకు గ్రీన్‌కార్డ్‌ రావాలంటే వేచి ఉండాల్సిన సమయం వందేళ్లపైనే. అంటే జీవిత కాలంలో గ్రీన్ కార్డు రావడం దుర్లభం అనుకోవచ్చు. ఇప్పటికి పది లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డుకు అర్హత సాధించి దరఖాస్తు చేసుకుని ఉన్నారు.  అమెరికా ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థ పట్ల భారతీయ ఇమ్మిగ్రెంట్స్‌లో  భ్రమలు పటాపంచలవుతున్నాయి.   అతి కష్టం మీద వర్క్‌ వీసా సంపాదించినా.. దానికి ఉన్న తక్కువ ఉపాధి అవకాశాలు, ఎంపాయిమెంట్‌ స్టేటస్‌ మారితే వీసా గడువు ముగిసిపోవడం వంటి పరిమితులు వారి కెరీర్‌ను, జీవితాలను ఇబ్బందుల్లో నెడుతున్నాయి. ట్రంప్ మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. 

గెలిచింది ట్రంప్ – గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్

భారత్‌పై పన్నులు వేస్తే  ఎగుమతులపై ప్రభావం
 
వాణిజ్యపరంగా భారత్‌కు అమెరికా చాలా కీలకం. భారతదేశ మొదటి 10 వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికాతోనే మనకు ట్రేడ్‌ సర్‌ప్లస్‌ ఉంది. అంటే మనం అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే మనం అమెరికాకు చేస్తున్న ఎగుమతులే ఎక్కువ. భారత్‌తో వాణిజ్యం గురించి ట్రంప్‌ చాలా సార్లు మాట్లాడారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవాటిపై భారత్ ఎక్కువ పన్నులు వేస్తోందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పన్నులు విధించినా ఆశ్చర్యం లేదు. భారత్‌లో సెమీకండక్టర్‌ ఫాబ్రికేషన్‌ కేంద్రం ఏర్పాటుకు, ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీ, అంతరిక్ష, 6జీ మొబైల్‌ సాంకేతికత, సెమీకండక్టర్‌ వంటి అధునాతన సాంకేతికతలపై కలిసి పని చేసేందుకు భారత్‌, అమెరికా ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత బైడెన్‌ సర్కారు ప్రయత్నించింది.  ఈ విధానాలను ట్రంప్ కొనసాగించవచ్చు. ఇది పరోక్షంగా భారత్‌కు మేలు కలిగిస్తుంది.

అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?

భారత్‌తో దౌత్య సంబంధాలు బలపడే అవకాశం 

గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, అధ్యక్షుడు రిపబ్లికన్‌ అయినా, డెమోక్రట్‌ అయినా భారత్‌తో మాత్రం సంబంధాలు బలపడుతున్నాయి.  ట్రంప్‌తో  ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి.  వలస విధానం విషయంలో ట్రంప్‌ ఆలోచనలు, విధానాలు కొంత కఠినంగానే ఉంటాయి. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఇమ్మిగ్రేషన్‌ విధానంపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్‌ కఠినంగా వ్యవహరించవచ్చు. భారతీయులకు కీలకమైన హెచ్‌1బీ వీసాలపైనా పరిమితులు విధించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి భారతీయులకు ఇబ్బందికరం కావొచ్చు. అయితే ఎన్నికల ప్రచారంలో అనేక హామీలను ట్రంప్ ఇచ్చారు. వాటి ప్రకారం చూస్తే పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చన అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి

Source link