indian navy has released notification for the recruitment of ssc officers entry January 2026 course | Navy Jobs: ఇండియన్ నేవీలో 270 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు

Indian Navy Recruitment: భారత నౌకాదళం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు, కేడర్‌, స్పెషలైజేషన్లలో శిక్షణ ఉంటుంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ/బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది. సరైన అర్హతలు గల అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

* షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2026 కోర్సు

మొత్తం ఖాళీల సంఖ్య: 270.

బ్రాంచి/ కేడర్ వివరాలు..

* ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి

➥ జనరల్ సర్వీస్(జీఎస్‌-ఎక్స్‌/ హైడ్రో కేడర్‌): 60 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 02 జనవరి 2001 నుంచి  01 జూలై 2006* మధ్య జన్మించిన వారై ఉండాలి. 

➥ పైలట్: 26 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. (అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి అండ్ ఇంటర్‌లో 60% మార్కులను కలిగి ఉండాలి.  పదో తరగతి అండ్ ఇంటర్‌లో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి).

వయోపరిమితి: 02 జనవరి 2002 నుంచి 01 జనవరి 2007 వరకు** మధ్య జన్మించిన వారై ఉండాలి.

➥ నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (ఎయిర్ క్రూ): 22 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. (అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి అండ్ ఇంటర్‌లో 60% మార్కులను కలిగి ఉండాలి.  పదో తరగతి అండ్ ఇంటర్‌లో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి).

వయోపరిమితి: 02 జనవరి 2002 నుంచి 01 జనవరి 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.

➥ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 18 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. (అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి అండ్ ఇంటర్‌లో 60% మార్కులను కలిగి ఉండాలి.  పదో తరగతి అండ్ ఇంటర్‌లో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి).

వయోపరిమితి: 02 జనవరి 2001 నుంచి 01 జనవరి 2005 మధ్య జన్మించిన వారై ఉండాలి.

➥ లాజిస్టిక్స్: 28 పోస్టులు
అర్హత: ఫస్ట్ క్లాస్‌తో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఫస్ట్ క్లాస్‌తో ఎంబీఏ లేదా ఫైనాన్స్/లాజిస్టిక్స్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్/మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో పిజి డిప్లొమాతో పాటు ఫస్ట్ క్లాస్‌తో బీఎస్సీ/ బీకామ్/ బీఎస్సీ(ఐటీ) లేదా ఫస్ట్ క్లాస్‌తో ఎంసీఏ/ ఎంఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 02 జనవరి 2001 నుంచి 01 జూలై 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.

* ఎడ్యుకేషన్‌ బ్రాంచి

➥ ఎడ్యుకేషన్‌: 15 పోస్టులు
అర్హతలు: 

  • 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్)తో పాటు ఎంఎస్సీ(మ్యాథ్స్/ఆపరేషనల్ రీసెర్చ్).
  • 60 శాతం మార్కులతో బీఎస్సీ(మ్యాథ్స్)తో పాటు ఎంఎస్సీ(ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్).
  • 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్)తో పాటు ఎంఎస్సీ(కెమిస్ట్రీ).
  • కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్(మెకానికల్ ఇంజినీరింగ్‌).
  • కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్).
  • కనీసం 60% మార్కులతో ఎంటెక్ (థర్మల్/ ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ మెషిన్ డిజైన్).
  • ఎంటెక్ (కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ VLSI/ పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్).

వయోపరిమితి:  బీఈ, బీటెక్, ఎంఎంస్సీ అర్హత ఉన్నవారు 02.01.2001 – 01.01.2005 మధ్య, ఇతరులు 02.01.1999 – 01.01.2005 మధ్య జన్మించిన వారై ఉండాలి. (అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి అండ్ ఇంటర్‌లో 60% మార్కులను కలిగి ఉండాలి.  పదో తరగతి అండ్ ఇంటర్‌లో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి).

* టెక్నికల్‌ బ్రాంచి

➥ ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 38 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్/మెకానికల్ విత్ ఆటోమేషన్, మెరైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, కంట్రోల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 02 జనవరి 2001 నుండి 01 జూలై 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.

➥ ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 45 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్, టెలి కమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్(AEC), ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 02 జనవరి 2001 నుండి 01 జూలై 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.  

➥ నావల్‌ కన్‌స్ట్రక్టర్‌: 18 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్/ మెకానికల్ విత్ ఆటోమేషన్, సివిల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటలర్జీ, నావల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, షిప్ టెక్నాలజీ, షిప్ బిల్డింగ్, షిప్ డిజైన్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 02 జనవరి 2001 నుండి 01 జూలై 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: నెలకు రూ.1,10,000తో పాటు ఇతర అలవెన్సులు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link